ఒత్తైన, నల్లటి కురులు కావాలని అందరూ కోరుకుంటారు.కానీ, ఇటీవల రోజుల్లో పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, జీవన శైలిలో మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, తరచూ హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను వినియోగించడం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు అధికంగా ఊడటం లేదా చిన్న వయసులోనే తెల్లబడటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
దాంతో ఈ సమస్యలను నివారించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.
ఎండుకంటే, ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్‌ను వాడితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు ఎండిన ఉసిరి కాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల కలోంజి విత్తనాలు, గుప్పెడు ఎండిన కరివేపాకు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ కొబ్బరి నూనెను పోయాలి.అలాగే అందులో కలోంజి సీడ్స్, ఉసిరి మరియు కరివేపాకు పొడి వేసి స్లో ఫ్లేమ్‌పై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక.అప్పుడు పల్చటి వస్త్రం సాయంతో నూనెను సపరేట్ చేసుకుని ఒక బాటిల్‌లో నింపుకోవాలి.
ఈ ఆయిల్‌ను రాత్రి నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకుని పడుకోవాలి.
ఉదయాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి తలస్నానం చేయాలి.నాలుగు రోజులకు ఒకసారి ఇలా చేస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.