రాఘవేంద్రరావు సినిమాల్లో లారీ డ్రైవర్ వేషధారణ కూడా ఎందుకు రిచ్‌గా ఉంటుంది..

కె.రాఘవేంద్రరావు( K Raghavendra Rao ) ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Why Heros Are Rich In Raghavendra Rao Movies Details, Raghavendra Rao, Raghavend-TeluguStop.com

రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను ఇతను టచ్ చేశాడు.మొత్తం 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి తన సత్తా చాటాడు.

ఈ దర్శకేంద్రుడి సినిమా ప్రస్థానం బాబు (1975) మూవీతో( Babu Movie ) ప్రారంభమైంది.ఇందులో ఒక లవర్ బాయ్ ఉంటాడు.

అతను ప్రేమించడానికి ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.అబౌవ్‌ యావేరేజ్ గా ఆడిన ఈ సినిమా ఎలాగోలా 100 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడగలిగింది.

ఈ మూవీకి రాఘవేంద్రరావు తండ్రి కె.యస్ ప్రకాశరావు స్టోరీ అందించారు.

ఈ సినిమాలో లవర్ బాయ్ గా శోభన్ బాబు( Shoban Babu ) నటించాడు.ఇందులో హిందీ యాక్ట్రెస్ అరుణా ఇరానీ ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా కనిపించింది.

మిగిలిన హీరోయిన్ల పాత్రలను వాణిశ్రీ , లక్ష్మి పోషించారు.లక్ష్మి చాలా అందంగా ఉంటుంది.

ఈ మూవీలో హీరో జమీందారి కుటుంబంలో పుడతాడు.అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.

చివరికి అతడు టైలర్ అవుతాడు.టైలర్ అయినా సరే లవర్ బాయ్ గా ఉంటాడు.

చాలా చక్కగా డ్రస్ చేసుకుంటాడు.హుందాగా కనిపిస్తాడు.

నిజానికి ఈ సినిమాలోనే కాదు అన్ని సినిమాల్లో కూడా కె.రాఘవేంద్రరావు హీరోలు చాలా రిచ్ గా, మంచి దుస్తులలో కనిపిస్తుంటారు.

Telugu Aruna Irani, Babu, Raghavendra Rao, Lorry, Raghavendrarao, Shoban Babu-Mo

రాఘవేంద్రరావు తన ఫస్ట్ సినిమాలోనే తన మార్కు చూపించేశాడు.ఈ సినిమా కాస్త సాగదీతగా అనిపిస్తుంది కానీ ఇందులో రాఘవేంద్రరావు తన మార్క్ 100% కనబరిచాడు.రంగుల పందిరి అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో హీరో వేషధారణ చూస్తే నిజ జీవితంలో అసలు టైలర్ అనే వాడు ఇలా ఉంటాడా అని ఆశ్చర్యపోక తప్పదు.ఈ దర్శకుడు సినిమాలో లారీ డ్రైవర్, ( Lorry Driver ) జేబుదొంగ, సామాన్య గైడ్ కూడా రిచ్ గా కనిపిస్తాడు.

ఇదే విషయం గురించి ఒక విలేకరి రాఘవేందర్రావు ని సూటిగా ప్రశ్నించాడు.ఇలాంటి రిచ్ లైఫ్ గడిపే జేబుదొంగలు, లారీ డ్రైవర్లు ఉంటారా సార్ అని ప్రశ్నించారు.

Telugu Aruna Irani, Babu, Raghavendra Rao, Lorry, Raghavendrarao, Shoban Babu-Mo

దానికి ఈ దర్శకుడు సమాధానం ఇస్తూ “సినిమానే ఒక కల్పన.దానికి నిజ జీవితంతో ఎలాంటి సంబంధం లేదు.మామూలుగా ఇలాంటి వాళ్లు నిజజీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు, అవి మార్చేసి వారిని సంతోషంగా, రిచ్ గా చూపిద్దామంటే ఇక్కడ కూడా వాళ్లు అలా బతకకూడదు అంటూ కొంతమంది ఏడ్చేస్తుంటారు.అలా వారి వేషధారణ చూసి ఏడుపు చూపించడం సమంజసం కాదు.

కోరికలు తీరని ఒక లారీ డ్రైవర్ తనని హీరోలో చూసుకుని సంతోషంగా ఫీల్ అవుతాడు.నా సినిమాలకు అసలైన ప్రేక్షకులు వాళ్లే” అని ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.

చెప్పినట్లే ఆయన చివరి వరకు తన సినిమాల్లో అదే వైఖరిని ఫాలో అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube