ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నారు.షుగర్ కాస్త ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోతే మాత్రం చాలా ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
షుగర్ స్థాయి పడిపోవడం వల్ల ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.షుగర్ లెవెల్స్ తగ్గించుకునేందుకు లేదా ఒకే లెవెల్ లో ఉంచుకునేందుకు ఇన్సులిన్ ను షుగర్ వ్యాధి ఉన్నవారు ఉపయోగిస్తూ ఉంటారు.
కానీ కొన్నిసార్లు తీసుకునే ఆహారం మరియు ఇతర కారణాలవల్ల సహజంగానే షుగర్ నార్మల్ స్టేజ్ కి వస్తూ ఉంటుంది.ఈ విషయం తెలియని వారు ఎప్పుడు ఇలాగే ఇన్సులిన్ వేసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ మరింత పడిపోయే అవకాశం ఉంది.
షుగర్ స్థాయి మరింతగా తగ్గితే అప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులకు కళ్ళు తిరిగి పడిపోవడం లేదంటే తీవ్రమైన తల నొప్పి వంటి సమస్యలు వస్తాయి.ఇలాంటి సమయంలో ఈ వ్యాధి ఉన్న వారి నోట్లో చక్కెర ఒంటి తీపి పదార్థాలను వేయడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది.
షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పూర్తిగా పడిపోతాయో ఆ సమయంలో అవయవాలు కూడా పనిచేయడం ఆగిపోతాయి.ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు చెబుతున్నారు.
కొన్నిసార్లు వారికి కూడా తెలియకుండా ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి.దీంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది.

షుగర్ లెవెల్స్ పడిపోయిన సమయంలో పక్కన ఎవరూ లేకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం ఉంది.షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు తినే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి.అంతేకాకుండా వారానికి కనీసం ఒక్కసారైనా షుగర్ టెస్ట్ చేసుకోవడం మంచిది అని వైద్యులు చెబుతున్నారు.ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి అని రిజల్ట్స్ వస్తే ఇంజక్షన్కు బదులుగా చక్కెరను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే షుగర్ కాస్త ఉండే పండ్లను తీసుకోవడం వల్ల కూడా షుగర్ లెవెల్ నార్మల్ గా ఉంటాయి.అందుకోసమే ప్రతి ఒక్క డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినే తిండి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.