బిగ్ బాస్ విజేత ఎవరైనా సరే వారికి చిప్ప మాత్రమే మిగులుతుంది.కేవలం టైటిల్ తప్ప ఏమి ఒరిగేది లేదు.
ఇది గత సీజన్స్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది.మధ్యలో మిగతా ఇంటి సభ్యుల్లో ఎవరికి ఎలాంటి కాప్లిమెంట్ ఇచ్చిన అది విన్నర్ కి అన్నౌన్స్ చేసిన 50 లక్షల్లోంచి కొత్త విధించడం పరిపాటిగా జరుగుతుంది.
అసలు బిగ్ బాస్ టీమ్ కి ఈ ఐడియా ఇచ్చింది ఎవరో, దీన్ని ఒప్పుకున్నా ఆ హెడ్ ఎవరో కానీ వారికి బుర్ర బుద్ది ఏమి లేదు అని ఒప్పుకునే తీరాలి.మొన్న వీకెండ్ షో లో విన్నర్ గా గెలిచిన వారికీ 50 లక్షల ప్రైజ్ మనీ అని నాగార్జునా చెప్తుంటే అదొక వింత లాగ ఏం అనిపించింది అందరికి.
ఎప్పుడు ఇచ్చే ప్రైజ్ మనీ నే కదా.
అస్సలే యాడ్స్ పెద్దగా రాలేదు.పైగా ఫుల్ లాస్ లో నడుస్తుంది.అయినా కూడా ఇమ్మ్యూనిటీ అంటూ రాజ్ కి ఒక 5 లక్షలు అప్పనంగా ఇచ్చేసారు.
ఇది విన్నర్ అమౌంట్ లో నుంచి బొక్క పెట్టి మరి.ఇక ఈ ఐదు పొగ మిగిలింది 45 లక్షలు.అందులో ఎంటర్టైన్మెంట్ పన్ను కింద ఒక 13 లక్షలు కట్టింగ్ కూడా ఉంటుంది.అంటే చచ్చి చెడి ఫైనల్ వరకు వెళ్లి గెలిస్తే వచ్చేసి 32 లక్షలు.
సరే గుద్ది కన్నా మెల్ల మిన్న అన్నట్టుగా వచ్చిందేదో వచ్చింది అనుకుంటే మళ్లీ పప్పులో కాలేసినట్టే.ఎందుకు అంటే ఒక్కసారి గత సీజన్స్ కి వెళ్తే అభిజిత్, సోహెల్, అఖిల్ టాప్ 3 లో ఉన్నప్పుడు అందరి ముందు విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షల్లో సగం అంటే 25 లక్షలు పెట్టారు.
మీ ముగ్గుర్లో ఒకరు అక్కడ ఉన్న 25 లక్షలు తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోవచ్చు అనే తిరకాసు పెట్టగానే సోహెల్ ఎలాగూ మూడో ప్లేస్ అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి అతడు తెలివిగా ఆ పాతిక తో సరిపెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చాడు.ఇక అరియనా సైతం ఒక 10 లక్షలతో బయటకు వచ్చింది.ఇలా చివరికి అభిజిత్ కి పన్ను కోతలు పొగ కేవలం 17 లక్షలు మాత్రమే.ఇలాంటి ప్రోగ్రాం మరోసారి పెడితే 32 లో నుంచి విన్నర్ చేతికి వచ్చేసి ఏ పదో పరకో.
అంతకు మించి ఏమి లేదు.ఇన్ని వారల పాటు ఆడినందుకు వారానికి ఇంత అని వేసిన డబ్బులు మాత్రమే.
ఇక ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ పెడితే శ్రీ సత్య, ఇనాయ, ఫైమా లాంటి వారు టాప్ 5 కి వెళ్లే అవకాశం ఉన్నవారు కాబట్టి పక్క ఆ డబ్బు తో జంప్ అవుతారు.