ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.తాము ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు.
సీఎం తమకు సానుకూలంగా ఉంటారని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారన్నారు.సీపీఎస్ పై ప్రభుత్వం కాదన్నా ఉద్యోగులకు ఇంకా నమ్మకం ఉందని తెలిపారు.
ప్రభుత్వం టెక్నికల్ గా తెలుసుకొని సీపీఎస్ రద్దు చేయాలని కోరారు.అదేవిధంగా పీఆర్సీ కమిటీలు వేయొద్దని పేర్కొన్నారు.
సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలకు రోజూ ఒక బటన్ నొక్కుతున్నారన్న ఆయన.ఉద్యోగుల సంక్షేమానికి కూడా బటన్ నొక్కాలని ఆశాభావం వ్యక్తం చేశారు.







