చాలా మందికి టాయిలెట్ వెళ్లడం మద్దకంతో కూడిన పనిగా ఉంది.సరైన టైంలో సరైన విధంగా టాయిలెట్ కు వెళ్లకపోతే అనారోగ్యబారిన పడే అవకాశం ఉంటుంది.
అందుకే ఆరోగ్య నిపుణులు టాయిలెట్ కు వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.టాయిలెట్ నిలబడి వస్తున్నారా ? అలా చేయడం అసలు కరెక్ట్ కాదు.టాయిలెట్ కూర్చుని మాత్రమే వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.కూర్చుని టాయిలెట్ పోసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.యూరిన్ మన శరీరంలో,రక్తంలో ఉండే కొన్ని వ్యర్థ పదార్థాల మిశ్రమంగా చెప్పబడింది.
వ్యర్ధాలన్నిటిని మూత్రం రూపంలో కిడ్నీ ఫిల్టర్ చేస్తాయి.అలా రిలీజ్ అయిన మూత్రం మూత్రాశయంలోకి వెళ్తుంది.
అక్కడ యూరిన్ నిండేటప్పటికే మెదడు మూత్రానికి వెళ్లాలని తెలియచేస్తుంది.అప్పుడే మనం మూత్రానికి వెళ్తాం.కొందరు మగవారు కూడా కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు.కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే మగవారు నిలబడి కాక, కూర్చుని యూరిన్ కి వెళ్తే ఎంతో ఉపయోగం ఉంటుంది.
ఇది వినడానికి బాగా అనిపించక పోయిన ఇది మాత్రం నిజం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్నమగవారిలో మూడింట ఒక వంతు మంది కూర్చునే యూరిన్ కి వెళ్తున్నారు.
ఈ పద్దతిలో అలా మూత్ర విసర్జన చేసే వారిలో చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు అని తెలియవచ్చింది.ఇలా చేసే చాలా మందికి మూత్రాశయ సంబంధ సమస్యలు లేవు.
మూత్ర విసర్జన కూర్చుని చేయడం వల్ల శరీరానికి ఎంతో శుభ్రతను ఇచ్చినట్టు అవుతుంది.మూత్రాశయ లేదా శృంగార సంబంధ సమస్యలు ఉన్నవారు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే ఆ సమస్యలు తగ్గేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.కూర్చుని యూరికి వెళ్లడం వలన మూత్రాశయం నుంచి మూత్రం పూర్తిగా బయటకువచ్చేస్తుంది.ఇది మూత్రాశయ సమస్యలు, కిడ్నీ స్టోన్స్, ఉన్న వారికి చాలా మంచిది.
కాబట్టి ఇకనుండి మీ అలవాటు మార్చుకుని ఆరోగ్యవంతులుగా ఉండడం ఎంతో శ్రయేస్కరం.