బరువు తగ్గడం అనేది ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు.నెలల తరబడి నిరంతరం ఎంతో కృషి చేస్తే గానీ బరువు తగ్గడం ( Weight loss )పాజిబుల్ అవ్వదు.
అందుకే వెయిట్ లాస్ జర్నీలో మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.శరీరంలోని కొన్ని కిలోల బరువును తగ్గించుకోవడానికి వ్యాయామం, డైట్ రెండూ కీలక పాత్ర పోషిస్తాయి.
శరీరం ఎంత కేలరీలను ఖర్చు చేస్తుందో దానికంటే తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు.పిజ్జా, బర్గర్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వెయిట్ పెంచేవి కాబట్టి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి.

అంతేకానీ ప్రతిదీ తినకూడదు అనుకుంటూ స్ట్రిక్ట్ డైట్ ఫాలో కాకూడదు.ఎందుకంటే దీనిని ఎక్కువ కాలం పాటించడం కుదరదు.ఇలాంటి డైట్ పాటించడం వల్ల చివరికి ఆహార కోరికలు మరింత పెరుగుతాయి.దీనివల్ల ఆహార కోరికలను కంట్రోల్ చేసుకోలేక ఎక్కువ తినే ప్రమాదముంది.అయితే స్ట్రిక్ట్ డైట్( Diet ) ఫాలో కావడానికి ఒక పద్ధతి ఉందని నిపుణులు చెబుతున్నారు.దానిని “చీట్ మీల్“( Cheat meal )గా పేర్కొంటున్నారు.
ఈ విధానంలో వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు వారం లేదా నెలరోజులపాటు చాలా కఠినమైన డైట్ ఫాలో అవుతారు.నెల రోజుల తర్వాత ఒకరోజు వారు తమకు ఇష్టమైన ఫుడ్స్ లాగిస్తారు.
ఇలా తినే వాటినే చీట్ మీల్ అని అంటారు.

వెయిట్ లాస్ జర్నీలో చీట్ మీల్ ఉండటం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.వీటిని తినేటప్పుడు గిల్టీగా అసలు ఫీల్ అవ్వద్దని అంటున్నారు.అప్పుడప్పుడు ఇష్టమైన చీట్ మీల్ తినడం వల్ల శరీరంపై పెద్దగా ప్రభావం పడదు.
పైగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఒక నిర్దిష్ట సమయం తర్వాత చీట్ మీల్ లాగిస్తే కోరికలు తగ్గుతాయి.శరీరంపై ఎక్కువ ఒత్తిడి కూడా పడదు.అయితే చీట్ మీల్ తీసుకునే రోజు మొత్తం ఇష్టమైన ఫుడ్స్ మాత్రమే కాకుండా 20 శాతం న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోవడం మంచిది.చీట్ మీల్ అంటే ఇష్టమైన ఆహార పదార్థాలను పెద్ద మొత్తాలలో తినేయడం కాదని గమనించాలి.
ఒక్కరోజు మాత్రమే కదా అని ఎక్కువగా తింటే అంతకుముందు పడిన కష్టమంతా వృధా అవుతుంది.







