మొటిమలు, వాటి తాలూకు మచ్చలు తీవ్రంగా బాధిస్తున్నాయా.? ఎన్ని క్రీములు రాసినా తగ్గడం లేదా.? ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలన్నీ ప్రయత్నించి అలసిపోయారా.? అయితే డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక్క రెమెడీని ట్రై చేస్తే గనుక సహజంగానే మొటిమలు, వాటి వల్ల ఏర్పిడిన మచ్చలకు గుడ్ బై చెప్పేయవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.,
ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే దొరగా పండిన మామిడి పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.
దానికి ఉన్న తొక్కను మాత్రమే తీసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, మామిడి పండు తొక్కలు, ఒక కప్పు రోజ్ వాట్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోసి హీట్ చేయాలి.
హీటైన వాటర్‌లో మరో గిన్నెను పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల షియా బటర్ వేసి మెల్ట్ చేయాలి.అది మెల్ట్ అయిన వెంటనే యాపిల్-మామిడి తొక్కల జ్యూస్‌ను ఓ నాలుగు టేబుల్ స్పూన్ల చప్పున వేసి ఒక నిమిషాం పాటు హీట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కూల్ చేసుకుని.అప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ ప్యూర్ అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసి ఐదారు నిమిషాల పాటు విస్కర్ సాయంతో మిక్స్ చేస్తే క్రీమ్‌గా తయారు అవుతుంది.ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పది రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు.ప్రతి రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు, సాయంత్రం నిద్రించడానికి ముందు ఈ క్రీమ్‌ను రాసుకుంటే మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.