చిన్నపిల్లలను పెంచాలి అంటే అది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి.అయితే చిన్నపిల్లలు ఊరికే నోట్లో వేళ్ళు పెట్టుకుంటారు.
అది సహజంగా మనం ప్రతి పిల్లల విషయంలో చూస్తూనే ఉంటాం.అయితే పిల్లలను ఊరికే నోట్లో వేలు పెట్టుకోవడం మానపకపోతే పెద్దయ్యాక కూడా అదే అలవాటు పడిపోయే అవకాశం ఉంది.
ఇక చాలామంది చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు చెక్క ముక్కలు( Pieces of wood ) వేసి కాకుండా వి ఆకారంలో ఎక్కువగా కూర్చుంటూ ఉంటారు.కింద కూర్చున్న, కుర్చీల్లో కూర్చున్న, బెడ్ పైన కూర్చున్న డబ్ల్యూ సిట్టింగ్ ( W sitting )భంగిమల్లో చిన్నారులు కూర్చుంటే అది చాలా ప్రమాదకరం.
ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది.

ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో చిన్నారులు కూర్చోవడం వలన వారికి భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.డబ్ల్యూ సిట్టింగ్ లో కూర్చుంటే చిన్నారి నడుము, తొడలు, మోకళ్ళు, మడిమలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.ఇది శరీరంలో ఇతర అవయవాలు చేటు చేస్తుంది.
ఇక నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల వలన కీలక కండరాల శక్తి డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్లే నిస్తేజమవుతుంది.ఇక మరి ప్రధానంగా పొత్తికడుపు, వెన్నెముక( Abdomen, spine ) కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.
అయితే డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వలన శరీరంలోని పై భాగంలో ఉండే.

కండరాలు ( muscles )తమ సహజమైన వంగే గుణాన్ని కూడా కోల్పోతాయి.దీనివలన శరీరం ఒకే పొజిషన్ కు పరిమితమైపోతుంది.ఇక పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా భవిష్యత్తులో ఎక్కువ బరువున్న వస్తువులను మోయలేకపోతారు.
అంతేకాకుండా శరీరాన్ని బరువును బ్యాలెన్స్ చేసుకోవడం వారికి చాలా కష్టమైపోతుంది.దీంతో భవిష్యత్తులో కాళ్లు, వెన్నునొప్పులకు దారితీస్తుంది.
అందుకే పిల్లలు ఇలా కూర్చుంటున్నప్పుడు వాళ్ళని ఈ భంగిమలో కూర్చొనివ్వకుండా చూసుకోవాలి.వెంటనే ఈ అలవాటును మాన్పించాలి.







