అండర్ ఆర్మ్స్ వైట్( Underarms white ) గా మరియు స్మూత్ గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.కానీ అటువంటి అండర్ ఆర్మ్స్ ను పొందడం అంత సులభం కాదు.
ఎంతో శ్రద్ధ ఉండాలి.అండర్ ఆర్మ్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.
అయితే ఎంత కేర్ తీసుకున్నప్పటికీ ప్రస్తుత వేసవి కాలంలో అధిక వేడి, చెమట, గాలి సరిగ్గా ఆడక పోవడం వల్ల కొందరి అండర్ ఆర్మ్స్ మరింత డార్క్ గా మారుతుంటాయి.దాంతో స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు.
మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.మీ సమస్యకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ బెస్ట్ సొల్యూషన్.ఈ రెమెడీని పాటించారంటే డార్క్ అండర్ ఆర్మ్స్ తెల్లగా మృదువుగా మారతాయి.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking soda ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బాడీ వాన్, వన్ టేబుల్ స్పూన్ తేనె ( honey )మరియు సరిపడా నిమ్మరసం వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత అర నిమ్మ చెక్కను( lemon ) తీసుకుని అండర్ ఆర్మ్స్ ను బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా అండర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకోవాలి.ఆపై అండర్ ఆర్మ్స్ ను తడి లేకుండా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే అండర్ ఆర్మ్స్ లో నలుపు మొత్తం క్రమంగా మాయం అవుతుంది.అండర్ ఆర్మ్స్ తెల్లగా మృదువుగా మారతాయి.కాబట్టి డార్క్ అండర్ ఆర్మ్స్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.