నువ్వుల నూనెలో వీటిని కలిపి తలకు రాశారంటే మీ జుట్టు రెట్టింపు అవుతుంది!

సాధారణంగా మనలో కొందరి హెయిర్ చాలా పల్చగా ఉంటుంది.పలుచటి జుట్టు కారణంగా ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసిన సెట్ కావు.

 Try This Magical Oil For Double Hair Growth! Magical Oil, Double Hair Growth, Ha-TeluguStop.com

దీంతో జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు రెట్టింపు అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం డబుల్ హెయిర్ గ్రోత్ కు సహాయపడే ఆ రెమెడీ గురించి తెలుసుకుందాం పదండి.

Telugu Double, Care, Care Tips, Oil, Healthy, Latest, Sesame Oil, Thick, Magical

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్‌( Kalonji Seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), ఐదు లవంగాలు మరియు మూడు రెబ్బలు కరివేపాకు( curry leaves ) వేసుకుని ఫ్రై చేసుకోవాలి.ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో ఒక కప్పు నువ్వుల నూనె వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ), రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు( Garlic slices ) మరియు గ్రైండ్ చేసుకున్న పదార్థాలను వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి.

Telugu Double, Care, Care Tips, Oil, Healthy, Latest, Sesame Oil, Thick, Magical

ఇప్పుడు ఈ నూనెను రెండు రోజుల పాటు పక్కన పెట్టేయాలి.రెండు రోజుల అనంతరం స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.నైట్ ఆయిల్ అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది.జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

స్త్రీలు పురుషులు ఇద్దరూ ఈ ఆయిల్ ను వాడవచ్చు.పురుషులు ఈ ఆయిల్ వాడితే బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube