తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఐఎఫ్ఎస్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం సులువైన విషయం కాదు.తన ప్రతిభతో రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్ సాధించి రిత్విక( ritvika ) ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

 Ritwika Inspirational Success Story Details Here Goes Viral In Social Media , So-TeluguStop.com

ఆమె సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.జార్ఖండ్ లో జన్మించిన రిత్విక ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్( Electrical Engineering in Delhi ) పూర్తి చేశారు.

బాల్యం నుంచి రిత్వికకు జంతువులపై ప్రేమ ఉండేది.కాలేజ్ లో వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తి ఆమె కెరీర్ ను మార్చేసింది.

సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై పని చేయాలనే కోరికతో ఆమె అటవీ సంరక్షణ రంగంలో అడుగు పెట్టారని సమాచారం అందుతోంది.భూగర్భ శాస్త్రం, అటవీ శాస్త్రం ఎంచుకున్న రిత్విక అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.

తొలి ప్రయత్నంలో ఫెయిలైనా ఆమె ధైర్యం కోల్పోకుండా కష్టపడ్డారు.తల్లి సపోర్ట్ చేయడంతో ఫెయిల్యూర్స్ ను గుర్తించి ఆమె పాఠాలు నేర్చుకున్నారు.

Telugu Delhi, Ritwika-Inspirational Storys

రెండోసారి మరింత పట్టుదలతో చదివిన రిత్విక టైమ్ టేబుల్ ను ప్రిపేర్ చేసుకుని సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకున్నారని సమాచారం అందుతోంది.సిలబస్, పాత పరీక్ష పత్రాలను సైతం అధ్యయనం చేసిన రిత్విక ప్రిపరేషన్ మధ్య విరామాలు, డెడ్ లైన్స్ ను పాటిస్తూ సత్తా చాటారు.తల్లీదండ్రులు, స్నేహితుల సహకారం వల్లే పరీక్షలలో సత్తా చాటడం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.

Telugu Delhi, Ritwika-Inspirational Storys

నా సక్సెస్ తల్లీదండ్రులను సైతం గర్వపడేలా చేసిందని రిత్విక చెప్పుకొచ్చారు.రిత్విక టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.రిత్విక కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రిత్విక చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రిత్విక సక్సెస్ స్టోరీ నేటితరం యువతలో చాలామందిలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube