సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడమంటే అంత సులభమైన విషయం కాదు.ముఖ్యంగా హీరోయిన్లు.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ప్రయత్నాలు ఫలించక తిరిగివెళ్లినవారు కొంతమంది ఐతే….ఒకటి, రెండు సినిమాలు చేసిన తరువాత కనుమరుగైనవారు ఎంతోమంది.
అలాంటి సినీ పరిశ్రమలో అడుగు పెట్టడమే కాకుండా….మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకొని తిరుగులేని కెరీర్ ని ఏర్పరుచుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సమంత :
నేటి తరం హీరోయిన్లలో మొదటి స్థానం సమంతది( Samantha ) అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.“ఏ మాయ చేసావే” చిత్రం తో కెరీర్ మొదలు పెట్టిన సమంత అమితమైన క్రేజ్ ను సంపాదించుకుంది.గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జెస్సి పాత్ర తో యువతను ఆకట్టుకుంది సమంత.
తరువాత వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది.ఆ తరువాత విభిన్న పాత్రలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.
రష్మిక:
నాగ శౌర్య తో జంటగా నటించిన “ఛలో” చిత్రంతో తెలుగులో మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది రష్మిక.( Rashmika ) తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం చిత్రంలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.ఇక అల్లు అర్జున్ తో కలసి నటించిన పుష్ప చిత్రంలో ఆమె చేసిన శ్రీవల్లి పాత్రకు అనేక ప్రశంసలు అందుకుంది.సందీప్ రెడ్డి వంగ, రన్బీర్ కపూర్ కంబినేషన్లో వస్తున్నా “ఏనిమల్” చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
శ్రీ లీల:
శ్రీ లీల( Sreeleela ) ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సెన్సేషన్ .కే.రాఘవేంద్రరావు దర్శకత్వం లో విడుదలైన “పెళ్లి సందD” చిత్రంతో టాలీవుడ్ కి పారిచయమైన శ్రీ లీల మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకుంది.తరువాత రవి తేజ సరసన ధమాకాలో నటించింది.
ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది.ఇప్పుడు పెద్ద హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా అన్ని సినిమాలలోనూ ఈమెనే హెరాయిన్గా తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు నిర్మాతలు.
కృతి శెట్టి:
మొదటి సినిమా “ఉప్పెన” తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి శెట్టి( Krithi Shetty ) “బుజ్జమ్మ”గా తన నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.తరువాత శ్యామ్ సింఘా రాయ్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఐతే తరువాత మాత్రం ఆమె వరిసా ప్లాప్ల తో సతమతమౌతుంది.
మృణాల్ ఠాకూర్:
బాలీవుడ్లో అనేక సీరియల్స్, సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్న మృణాల్ ఠాకూర్,( Mrunal Thakur ) తెలుగు ప్రేక్షకులకు “సీత రామం” చిత్రంతో పరిచయమయింది.దుల్కర్ సల్మాన్ తో కలసి ఆమె నటించిన ఈ చిత్రం హను రాఘవపూడి తెరకెక్కించారు.ఈ చిత్రంలో సితామహాలక్ష్మిగా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది.ప్రస్తుతం నాని తో “హాయ్ నాన్న” చిత్రం లో నటిస్తోంది.ఒక్క విజయం తోనే వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బాలీవుడ్ భామ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్.
వైష్ణవి చైతన్య:
సాఫ్ట్వేర్ డెవలపర్ షార్ట్ ఫిలిం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మాయి మొదట ఆలా వైకుంఠపురంలో, టక్ జగదీష్, వాలిమై వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.ఇప్పుడు “బేబీ” చిత్రం తో తన మొదటి విజయాన్ని అందుకుంది.జులై 14న విడుదలైన ఈ చిత్రం 70 కోట్ల వసూళ్లు రాబట్టి, సూపర్ హిట్ గా నిలిచింది.
ఐతే ఇప్పుడు ఈ చిత్రం సక్సెస్ మీట్లో మెగా స్టార్ చిరంజీవి గారు వైష్ణవి పై ( Vaishnavi Chaitanya ) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.చిరంజీవి వైష్ణవి తనకు జయసుధను గుర్తుచేసింది అని అన్నారు.
మెగా స్టార్ నోటా ఈ మాట ఆమెకు బంగారు బాటను వేస్తుందో లేదో వేచి చూడాల్సిందే!
.