ప్రియుడి సర్‌ప్రైజ్ ప్లాన్ రివర్స్.. కేక్‌లో రింగ్ పెడితే ఇలాగే ఉంటది మరి!

ఇటీవల చైనాలో( China ) ఓ జంటకు వారి పెళ్లి ప్రపోజల్( Marriage Proposal ) అనుకోకుండా కామెడీ సీన్ అయిపొయింది.అసలు ఏం జరిగిందంటే, సిచువాన్ ప్రావిన్స్ కు చెందిన లియూ అనే అమ్మాయిని తన ప్రియుడు సర్‌ప్రైజ్ చేయాలని చూశాడు.

 Proposal Gone Wrong Chinese Woman Accidentally Eats Engagement Ring Hidden In Ca-TeluguStop.com

లవ్ ప్రపోజల్ కోసం ఓ బంగారు ఉంగరాన్ని( Gold Ring ) కేక్ లో దాచిపెట్టాడు.కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది.

ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే లియూకి బాగా ఆకలిగా అనిపించింది.ఇంట్లో టేబుల్ మీద మీట్ ఫ్లోస్ కేక్( Cake ) కనిపించడంతో వెంటనే తినేసింది.

అసలు విషయం ఏంటంటే, ఆ కేక్ లోనే ప్రియుడు ప్రపోజల్ రింగ్ దాచాడని పాపం ఆ అమ్మాయికి తెలీదు.

కేక్ తింటుండగా ఏదో గట్టిగా తగలడంతో.

ఏంటా అని చూస్తే.అది బంగారు ఉంగరం.

మొదట కేక్ బాగాలేదని తిట్టుకుంటూ.బేకరీకి కంప్లైంట్ చేద్దామనుకుందట పాపం.

కానీ ఇంతలో పక్కనే ఉన్న ప్రియుడు( Boyfriend ) కంగారుగా కేక్ ని చూసి “అది బహుశా నేను ప్రపోజ్ చేద్దామనుకున్న రింగ్ ఏమో” అని చెప్పాడు.

Telugu Cake Proposal, Chinaproposal, Story, Gold Eaten, Meat Floss Cake, Proposa

లియూ ఒక్కసారిగా షాక్.అది కూడా ఒకటి కాదు రెండు ముక్కలు అయిపోయింది, ఆ సీన్ చూసి ఆమె నమ్మలేకపోయింది.ప్రియుడు జోక్ చేస్తున్నాడేమో అనుకుందట.

కానీ రింగ్ ను దగ్గరగా చూస్తే అసలు విషయం అర్థమైపోయింది.

ఇద్దరూ కాసేపు సైలెంట్ అయిపోయారు.

ఏం చేయాలో తెలీక ఇబ్బంది పడ్డారు.అప్పుడు ప్రియుడు నవ్వుతూ.“ఇంకా మోకాళ్ల మీద కూర్చోవాలా?” అని అడిగాడు.అంతే లియూ ( Liu ) గట్టిగా నవ్వేసింది.

ప్రపోజల్ అనుకున్నట్టు జరగకపోయినా.చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని హ్యాపీగా డిసైడ్ అయ్యారు.ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ను లియూ ఆన్ లైన్ లో షేర్ చేసింది.“అసలు రింగ్ ను ఫుడ్ లో దాచొద్దండీ బాబూ” అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయిపోయింది.నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Telugu Cake Proposal, Chinaproposal, Story, Gold Eaten, Meat Floss Cake, Proposa

ఒక యూజర్ కామెంట్ చేస్తూ.“ఈ అమ్మాయి కొరికితే చిరుతపులి కూడా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిందే.” అని పంచ్ వేశాడు.మరోకరు.“పెళ్లి కూతురికి కంగ్రాట్స్.ఆమె సూపర్ స్ట్రాంగ్ పళ్లకు కూడా” అని కామెంట్ పెట్టారు.“నిజమైన ప్రేమ అంటే ఇదే.బంగారాన్ని కూడా బ్రేక్ చేయడం.” అంటూ ఇంకొకరు నవ్వేశారు.

“దయచేసి ఫుడ్ లో రింగ్స్ దాచడం ఆపండి.ఒకవేళ అది డైమండ్ రింగ్ అయితే.పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉంది.” అని మరొకరు సలహా ఇచ్చారు.ఏదేమైనా.

లియూ, తన ప్రియుడు.ఇప్పుడు జీవితాంతం గుర్తుండిపోయే ప్రపోజల్ స్టోరీని సొంతం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube