సివరపల్లి( Sivarapalli Web Series ) అనే వెబ్ సిరీస్ ఇటీవల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని దూసుకుపోతోంది.
ఇక ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న రోజే సుకుమార్ కూతురు నటించిన గాంధీ తాత చెట్టు( Gandhi Tatha Chettu ) అనే సినిమా కూడా విడుదల అయ్యి మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ రెండు సినిమాలలో రెండు డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించారు రాగ్ మయూర్.
( Rag Mayur ) సివరపల్లి అనే వెబ్ సిరీస్ లో హీరోగా నటించగా, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు.ఇలా ఒకే రోజు రెండు భిన్న పాత్రలతో ప్రేక్షకులను పలకరించారు.

అయితే రాగ్ మయూర్ సినిమాల విషయంలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్,( Fahadh Faasil ) అలాగే బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావును( Rajkumar Rao ) ఫాలో అవుతూ విభిన్నమైన స్క్రిప్స్ ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు.చదువులలో స్టేట్ టాపర్ అయిన రాగు మయూర్ చదువులను పూర్తిగా మానేసి నటనపై పూర్తిగా శ్రద్ధ పెట్టారు.ఒకప్పుడు సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి మీరు తన గురించి రివ్యూలు రాయించుకునే స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు రాగ్ మయూర్.కాగా ఇతని మొదటి చిత్రం సినిమా బండి.
ఇందులో మురిడేష్ బాబు అనే పాత్రలో నటించి మెప్పించాడు.ఈ సినిమాలో నటన కామిక్ టైమింగ్ నేచురల్ గా అనిపించడంతోపాటు ఈ సినిమా సక్సెస్ అవడంతో మంచి గుర్తింపు దక్కింది.
ఈ సినిమా తర్వాత వార్తగా అవకాశాలు క్యూ కట్టాయి.

విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులలో బాగా గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు.తాజాగా ప్రేక్షకులను పలకరించిన రెండు పాత్రలు కూడా విభిన్నమైన పాత్రలే.సివరపల్లి సిరీస్ లో అసలు ఏమాత్రం ఉద్యోగం ఇష్టం లేకుండా చేసే పంచాయితీ సెక్రటరీ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు.
అలాగే గాంధీతాత చెట్టు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు.ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులలో మరింత గుర్తింపును సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు రాగ్ మయూర్.