టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్ గా కియారా అద్వానీకి( Kiara Advani ) పేరుంది.తన భార్య కియారా గురించి సిద్దార్థ్ మల్హోత్రా( Siddharth Malhotra ) ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
లస్ట్ స్టోరీస్( Lust Stories ) లో కియారా అద్వానీ యాక్ట్ చేస్తున్న సమయంలోనే షూటింగ్ కు నేను హాజరయ్యానని సిద్దార్థ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు.
కియారా అద్వానీతో మాట్లాడటానికి నేను ఆ సినిమా సెట్ కు వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ సిరీస్ లో కియారా గురించి ఒక వైరల్ సీన్ ను షూట్ చేశారని ఆ సీన్ షూట్ సమయంలో నేను అక్కడే ఉన్నానని ఆ సీన్ షూట్ తర్వాతే నేను కలిశానని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.కొంత సమయం పాటు సరదాగా మాట్లాడుకున్నామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సిరీస్ కు సంబంధించిన కథను కరణ్ జోహార్ ముందుగానే నాకు చెప్పారని సిద్దార్థ్ తెలిపారు.

ఈ తరహా స్టోరీతో వెబ్ సిరీస్ చేయడం నాకు కొత్తగా అనిపించిందని ఆయన కామెంట్లు చేశారు.కియారా అద్వానీ విభిన్నమైన కథలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుందని స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కియారా అద్వానీ ఎంతో క్లియర్ గా ఉంటుందని సిద్దార్థ్ మల్హోత్రా అన్నారు.కియారాతో పెళ్లి తర్వాత పలు అంశాలపై నా అభిప్రాయం మారిందని సిద్దార్థ్ మల్హోత్రా పేర్కొన్నారు.

కియారాతో పెళ్లి తర్వాత లైఫ్, వర్క్, ఫ్యామిలీపై సరైన అవగాహన వచ్చిందని సిద్దార్థ్ మల్హోత్రా అన్నారు.కియారా ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని పద్ధతులు పాటిస్తుందని ఆమెలో నాకు నచ్చే విషయం ఇదేనని సిద్దార్థ్ కామెంట్లు చేశారు.నా బాల్యంలో నాన్న వర్క్ లైఫ్ బిజీగా ఉండటం వల్ల అమ్మే మా బాగోగులు చూసుకునేవారని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు.







