సమ్మర్ సీజన్ రానే వచ్చింది.మెల్ల మెల్లగా మండే ఎండలు ప్రారంభం అవుతున్నాయి.
ఈ ఎండా కాలంలో చిరాకు పుట్టించే చెమటలు, అతి దాహం, నీరసం, అలసట ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.వీటిని తట్టుకోవాలంటే.
ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ సమ్మర్లో కూల్ కూల్‌గా ఉండేందుకు పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ తరచూ కూల్‌డ్రింక్స్ తాగేస్తుంటారు.
నీటికి బదులుగా కూడా కూల్ డ్రింక్స్‌నే తాగుతుంటారు.
వేసవి తాపాన్ని తీర్చడంలోనూ, నీరసాన్ని తగ్గించడంలోనూ కూల్ డ్రింక్స్ బాగా ఉపయోగపడతాయని అనుకుంటారు.
కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు.కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమోగాని.
అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా కూల్ డ్రింక్స్ అతిగా తీసుకుంటే అందులో ఉండే రసాయన పదార్థాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
లివర్ డ్యామేజ్ లేదా ఇతర లివర్ సమస్యలు ఏర్పడేలా చేస్తాయి.
అలాగే కూల్ డ్రింక్స్‌ను ఓవర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల అసమతూకాన్ని కలిగిస్తుంది.దాంతో మూడ్ మారిపోతుంది, ఫలితంగా లైంగిక వాంఛల్ని తగ్గిస్తుంది.కూల్ డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల.
అందులో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ఎంతటి బలమైన దంతాలను అయినా బలహీనంగా మార్చేస్తుంది.
అదేవిధంగా, ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ శరీరంలో కాల్షియం లోపం ఏర్పడేలా చేస్తుంది.
దాంతో ఎముకలు మరియు కండరాల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.ఇక కూల్ డ్రింక్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
కాబట్టి, కూల్ కూల్‌గా ఉన్నాయి కదా అని కూల్ డ్రింక్స్‌ను ఓవర్‌గా తీసుకుని.రిస్క్‌లో మాత్రం పడకండి.