1.ఏపీకి వర్ష సూచన
ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
2.ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు కామెంట్స్
ఏపీ ప్రభుత్వంపై బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు కేంద్రం సరఫరా చేసే ఉచిత బియ్యం ను రాష్ట్రం అందించడం లేదని కేంద్రం బియ్యాన్ని అమ్ముకుంటోంది అని వీర్రాజు విమర్శించారు.
3.చంద్రబాబు పై రోజా కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి రోజా విమర్శలు చేశారు.చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయిందా అంటూ విమర్శించారు.
4.17వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి.ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
5.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.వర్షాలు తగ్గేవరకు సెలవులు లేవు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది.వర్షాలు తగ్గే వరకు జిహెచ్ఎంసి కార్మికులకు సెలవులు ఇచ్చేదే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
7.తిరుమల సమాచారం
తిరుమలలో 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం, సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మల్లయప్ప స్వామి.
8.వరదమంపు గ్రామాల్లో హోం మంత్రి పర్యటన
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం లో వరద ముంపు ప్రాంతంలో హోం మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు.
9.వరదలపై కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు వరద మంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
10.మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర
ఆగస్టు రెండో తేదీ నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించనున్నారు.
11.కేరళ లో మంకీ ఫాక్స్ కలకలం
కేరళలో మంకీ ఫాక్స్ కేసు కలకలం సృష్టించింది.విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి మంకీ ఫాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు.
12.మహారాష్ట్రలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గింపు
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
13.భద్రాచలంలో ఉధృతంగా గోదావరి
భద్రాచలంలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.గురువారం మధ్యాహ్నానికి నదిలో నీటి మట్టం 60.30 అడుగులకు చేరుకుంది.
14.ఆసుపత్రిలో చేరిన స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు.రెండు రోజుల క్రితం ఆయన కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
15.అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్
ఎడతెరపి లేని వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర ను అధికారులు నిలిపివేశారు.
16.వర్మ పై రాజమౌళి తండ్రి ప్రశంసలు
హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలపై ఎన్ జీ టి సీరియస్ హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణపై ఎన్.జి.టి.జీహెచ్ ఎంసీ పై మండిపడింది.దీనిపై జిహెచ్ఎంసి ఇచ్చిన రిపోర్ట్ పై ఎన్జీటి అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ కేసును ఆగస్టు మూడో తేదీకి వాయిదా వేసింది.
17.సీఐ నాగేశ్వరరావు కేసు విచారణ వేగవంతం
సిఐ నాగేశ్వరరావు కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు.పది రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
18.వరద పరిస్థితులపై మంత్రి సమీక్ష
తెలంగాణలో పరిస్థితులపై మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య , ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
19.ముంపు గ్రామాల ప్రజలను తరలించండి : కేసీఆర్
భారీ వర్షాలు వరదల వల్ల కలిగే ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
20.అందుబాటులోకి పదో తరగతి షార్ట్ మెమో
తెలంగాణలో పదో తరగతి షార్ట్ మెమోలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.