చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే కూరగాయల్లో క్యాప్సికం ముందు వరుసలో ఉంటుంది.క్యాప్సికం( Capsicum ) మనకు గ్రీన్, రెడ్, ఎల్లో ఇలా పలు కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతూ ఉంటుంది.
సూప్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వంటి ఆహారాల్లో క్యాప్సికం ను విరివిరిగా వాడుతుంటారు.అలాగే క్యాప్సికం తో రకరకాల కర్రీస్ కూడా తయారు చేస్తుంటారు.
ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు క్యాప్సికంలో నిండి ఉంటాయి.అలాగే ఆరోగ్యపరంగా క్యాప్సికం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
వారానికి ఒక్కసారి క్యాప్సికం ను తిన్నా కూడా బోలెడు లాభాలు మీ సొంతం అవుతాయి.ఈ నేపథ్యంలోనే ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచే క్యాప్సికం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ రక్త నాళాలు, చర్మం, అవయవాలు మరియు ఎముకల సమగ్రతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

అలాగే శరీరంలో అదనపు కొవ్వును కరిగించడానికి క్యాప్సికం చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.క్యాప్సికం ను డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ వేగవంతం అవుతుంది.దాంతో కేలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.క్యాప్సికంలో క్యాప్సైసిన్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉన్నాయి.ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధించి క్యాన్సర్ నుండి రక్షణను కల్పిస్తాయి.జీర్ణ సమస్యలకు క్యాప్సికం ఒక సహజ మెడిసిన్ లా పనిచేస్తుంది.
క్యాప్సికంను డైట్ లో చేర్చుకుంటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలన్నీ( Digestive problems ) దూరమవుతాయి.మరియు స్టమక్ అల్సర్ ను నివారించే సామర్థ్యం కూడా క్యాప్సికం కు ఉంది.

క్యాప్సికం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అధిక కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులు( Heart Disease ) వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.అంతేకాకుండా క్యాప్సికం మధుమేహాన్ని నియంత్రిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.ఇక క్యాప్సికంలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల.ఇవి చర్మానికి తేమను అందిస్తుంది.
స్కిన్ మృదువుగా కోమలంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.







