టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న బ్యూటీలలో ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ) ఒకరు.డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాలో దబిడి దిబిడి సాంగ్ ఊర్వశి రౌతేలాకు మంచి పేరును తెచ్చిపెట్టింది.
అయితే ఈ బ్యూటీ తాజాగా ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.ఊర్వశి రౌతేలా 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోల్స్ రాయిస్ కులినన్( Rolls Royce Cullinan ) ను కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఏజెంట్, బ్రో, స్కంద సినిమాలలో సైతం ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.భారత్ లో ఏ నటి కూడా ఇప్పటివరకు రోల్స్ రాయిస్ కులినన్ కారును కొనుగోలు చేయలేదు.
ఊర్వశి రౌతేలా ఈ కారు కొనుగోలు చేసింది నిజమైతే మాత్రం అరుదైన రికార్డ్ ఈ బ్యూటీ ఖాతాలో చేరినందుకు ఈ బ్యూటీ అభిమానులు సంతోషించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

ఇన్ స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్( Forbes Rich List ) లో సైతం ఊర్వశి రౌతేలాకు స్థానం దక్కిందని సమాచారం అందుతోంది.ఒకవైపు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ చేయడం ద్వారా ఈ బ్యూటీ వార్తల్లో నిలుస్తున్నారు.డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఊర్వశి రౌతేలాకు తెలుగులో ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఊర్వశి రౌతేలాకు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఊర్వశి రౌతేలా రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.ఊర్వశి రౌతేలా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఊర్వశి రౌతేలా వయస్సు పెరుగుతుండగా అదే సమయంలో ఆమెకు ఆఫర్లు సైతం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.







