సీనియర్ , దివంగత నటి విజయనిర్మల వారసుడిగా నరేష్( Naresh ) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కెరియర్ తొలినాళ్లల్లో ఈయన కామెడీ హీరోగా( Comedy Heroes ) ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఇప్పటికీ కూడా నరేష్ వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
అప్పట్లో కామెడీ హీరోస్ అంటే నరేష్ రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) అని మాత్రమే చెప్పాలి.వీరిద్దరూ కూడా సినిమాలలో కామెడీ హీరోలుగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.
ఇప్పటికి ఇద్దరు హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా నరేష్ రాజేంద్రప్రసాద్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఆ రోజుల్లో కామెడీ హీరోలు అంటే నేను రాజేంద్రప్రసాద్ మాత్రమే ఉండేవారు.మా ఇద్దరి మధ్య చాలా గట్టి పోటీ ఉండేది.
ఇక మా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టం ఎందుకంటే రాజేంద్రప్రసాద్ చేసే పాత్రలు నేను చేయలేను, నేను చేసే పాత్రలు అతడు చేయలేడు ఇక నా విషయానికొస్తే రాజేంద్రప్రసాద్ కంటే నేనే గొప్ప నటుడిని.అలా ఫీల్ అవ్వకపోతే మనం సక్సెస్ అవ్వలేమని నరేష్ తెలిపారు.

నిన్ను నువ్వు ప్రేమించుకోనప్పుడు, బయట వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు?’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.ఇలా రాజేంద్రప్రసాద్ నా కంటే గొప్ప నటుడేం కాదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అభిమానుల విమర్శలు కురిపిస్తున్నారు.నటన విషయంలో మీకంటే రాజేంద్రప్రసాద్ గారి నటన అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.