ప్రస్తుత రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్ల వయసులోనే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.కాలుష్యం, హార్మోన్ ఛేంజస్, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఎండల్లో తిరగడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, రాత్రుళ్లు మేకప్‌తో నిద్ర పోవడం, డెడ్ స్కిన్ సెల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోవడం, శరీర బరువులో మార్పులు, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటి రకరకాల కారణాల వల్ల యంగ్ ఏజ్‌లోనే ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి.
ఇవి చూసేందుకు అసహ్యంగా కనిపించమే కాదు.తక్కువ వయసును ఎక్కువగా చేసి చూపిస్తుంటాయి.
అందుకే ముడతలను తగ్గించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.రకరకాల సీరమ్స్, ఆయిల్స్, క్రీమ్స్ వాడుతుంటారు.
అయినా ఫలితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక తీవ్రంగా మదన పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే గనుక ముడతలను సులభంగా వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక కట్ట పార్స్లీ ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసుకున్న పార్స్లీ ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించి చల్లారబెట్టుకోవాలి.
ఆపై ఉడికించిన పార్స్లీ ఆకులను, రైస్‌ను మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ రైజ్ బ్రాన్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రామాన్ని ముఖానికి పట్టించి.ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని ఐదైనా మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక వారంలో రోజుల్లోనే ముడతలు తగ్గడాన్ని మీరు గమనిస్తారు.