పీరియడ్స్ సమయంలో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టాలంటే...టిప్స్

మహిళలకు పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి ,నిద్రలేమి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి.ఇలా నిద్ర పట్టకపోవడం వలన ఇరిటేషన్, మూడ్ స్వింగ్ వంటి సమస్యలు వస్తాయి.

 Periods Time Nidra Lemi Reduced Tips-TeluguStop.com

ఈ సమస్యలను అధికమించాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి.సమతుల ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులను చేసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో కూడా మంచి నిద్రను పొందవచ్చు.

పీరియడ్స్ సమయంలో బాగా నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

సాధ్యమైనంత వరకు కాఫీ,టీలను త్రాగటం తగ్గించాలి.

ఎందుకంటే వీటిలో ఉండే కెఫీన్ నిద్ర రాకుండా చేస్తుంది.అంతేకాక ఇవి నిద్ర మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

అందువల్ల ఆ సమయంలో కెఫీన్ పదార్ధాలకు దూరంగా ఉండటమే మంచిది.

ఉదయం నీరెండలో విటమిన్ డి ఉంటుంది.కాబట్టి ఆ సమయంలో కాసేపు ఎండలో ఉంటే శరీరం విటమిన్ డి ని గ్రహిస్తుంది.విటమిన్ డి మాత్రలను వేసుకోవటం కన్నా ఎండలో ఉండటమే బెటర్.

ఇది లెప్టిన్ అనే హార్మోన్ ను విడుదల చేసి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.

ద్రవాలు ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో వ్యర్ధాలు బయటకు పోయి రాత్రి సమయంలో మంచి నిద్ర పడుతుంది.

రోజులో శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుందో లేదో చూసుకోవాలి.

ఎందుకంటే క్యాల్షియం తక్కువైనా నిద్రలేమి సమస్య వస్తుంది.అందువల్ల క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవటం చాలా ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube