హిందువులు లేదా సనాతన ధర్మాన్ని పాటించేవారు నుదిటి మీద కుంకుమ, తిలకం, లేదా విభూది ధరిస్తారు.ఇది హిందువులకు సంబంధించినంతవరకు చాలా ముఖ్యమైన లేదా అతి ప్రాముఖ్యమైన సాంప్రదాయం అనుకోవచ్చు.
మరి దీని వెనుక కారణం ఏమిటి? నుదిటి మీద బొట్టు లేదా విభూది లేదా కుంకుమ ఎందుకు ధరించాలి.
ఈ సంప్రదాయం వెనుక ఇటు ఆధ్యాత్మిక కారణాలతోపాటు శాస్త్రీయ కారణాలు లేదా సైన్స్ కి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి.
రెండు వైపులా ఉన్న కారణాలను తెలుసుకుందాం.మొదట ఆధ్యాత్మిక కారణాలు తెలుసుకుందాము.
ఇస్కాన్ అంటే ఏంటో మీకు తెలుసుగా.ఇందులో అందరూ కృష్ణుడి భక్తులే ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇస్కాన్ వ్యాపించి ఉంది.ఇస్కాన్ వారి ప్రకారం మానవ శరీరంలో పరమాత్మ ఉంటాడు.
మనలో కూడా విష్ణుమూర్తి లేదా కృష్ణుడు ఎల్లప్పుడు మన వెంటే మనతో పాటే పరమాత్మగా కొలువై ఉంటాడు.పరమాత్ముడికి మన శరీరం ఇల్లు లాంటిది.
కాబట్టి ఇల్లుని శ్రద్ధగా పవిత్రంగా అలంకరించుకోవడం అవసరం.అందుకే నిలువు నామాన్ని తిలకంగా ధరిస్తారు.
తిలకాన్ని పూర్వకాలంలో పుణ్యనదుల మట్టి నుంచి సేకరించే వారట.పుణ్య నదులలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరిస్తారు కాబట్టి, ఈ మట్టికి ఎన లేని పవిత్రత చేకూరుతుందని విశ్వాసం.
ఇక శివభక్తులు శివుడి యొక్క వైరాగ్యాన్ని తాము కూడా ధరిస్తున్నట్లు చెప్పడానికి విభూదిని ధరిస్తారు.

ఇక సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే. కనుబొమ్మల మధ్య ఒక నెర్వ్ పాయింట్లు ఉంటుంది.దీనినే ఆంగ్లంలో concentration point అని అటారు.
ఇది pineal మరియు pituitary glands కి కనెక్ట్ అయి ఉంటుంది.దీన్నే intuition point అని కూడా అంటారు.
ఈ పాయింట్ వద్ద ప్రశాంతత చాలా అవసరం.అప్పుడే ఏకాగ్రత ఉంటుంది.
ఆ పాయింట్ వద్ద చల్లదనంతో పాటు రక్త ప్రసరణ బాగా ఉండాలని ఋషులు మునులు నుదిట తిలకాన్ని ధరించడం మొదలుపెట్టారు.ఏకాగ్రత వలన వారు తమ మనసుని అదుపులో పెట్టుకోగలిగేవారు.
అలాగే చురుకైన మెదడు పనితనాన్ని కలిగి ఉండేవారు.ఈ పాయింటుని సంస్కృతంలో అజ్ఞ చక్రం అని అంటారు.
ఇదండి, నుదిటి మీద కుంకుమ, తిలకం, విభూది ధరించటం వెనుక అసలు కారణం.