నటుడు ప్రియదర్శి( Priyadarshi ) హీరోగా రామ్ జగదీష్ దర్శకత్వంలో నాని నిర్మాతగా తెరకెక్కిన చిత్రం కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ( Court: State vs A Nobody ).ఈ సినిమా హోలీ పండుగను పురస్కరించుకొని మార్చి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒకవైపు నాని మరోవైపు నటుడు ప్రియదర్శి వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా నటుడు ప్రియదర్శి రామ్ చరణ్( Ram Charan ) గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయిందిఇక ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలు భాగమైన సంగతి తెలిసిందే.ఇక ప్రియదర్శి కూడా ఈ సినిమాలో ఒక సన్నివేశంలో కనిపిస్తారు.ఇక ఈ సినిమా గురించి ప్రియదర్శి మాట్లాడుతూ.
బలగం సినిమా కంటే ముందుగానే తాను గేమ్ చేంజర్ సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు.అప్పుడు నేను హీరో ఫ్రెండ్ పాత్రలలోనే నటించేవాడిని.

ఇక ఈ సినిమాలో కూడా నేను చాలా సన్నివేశాలలో నటించాను.అవన్నీ ఎడిటింగ్‌లో పోయాయి.నా పాత్ర చిన్నదని నాకు ముందే తెలుసు.నేను 25 రోజులు పనిచేశా కానీ 2 నిమిషాలు కూడా కనిపించను అంటూ ప్రియదర్శి వెల్లడించారు.శంకర్‌గారు, రామ్‌చరణ్ అన్న, తిరుగారితో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది.శంకర్ నాతో వ్యక్తిగతంగా సినిమా చేయకపోయినా ఆయన డైరెక్షన్లో నేను నటించాను అనే ఆనందం నాకు కలిగింది అంటూ ప్రియదర్శి తెలిపారు.
అలాగే చిరంజీవి గారితో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలని కోరిక ఉంది.ఆచార్యలో నాకు ఒక అవకాశం ఇచ్చారు కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ నుంచి ఆ పాత్రను తొలగించడంతో అవకాశం కోల్పోయానని, చిరంజీవి గారితో కలిసి నటించాలన్నదే నా కోరిక అంటూ ఈయన తెలియజేశారు.







