టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరంకు( Kiran Abbavaram ) ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.కిరణ్ అబ్బవరం పారితోషికం కూడా పరిమితంగానే ఉందనే సంగతి తెలిసిందే.
ఈ నెల 14వ తేదీన కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాతో( Dilruba Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సినిమా న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అని కిరణ్ అబ్బవరం తెలిపారు.
మేము ముందుగానే ఈ సినిమా కథేంటో రివీల్ చేశామని హీరో క్యారెక్టరైజేషన్ పై నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో హీరోకు సారీ, థ్యాంక్స్ అనే పదాలకు గొప్ప విలువ ఉంటుందనే భావన ఉంటుందని హీరో ఒకసారి సారీ చెప్పకపోవడం వల్ల ఎలాంటి పర్యావసానాలు ఎదుర్కొన్నాడు? మాజీ ప్రేయసి వచ్చి హీరో ప్రేమను గెలిపించడానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని కిరణ్ అబ్బవరం అన్నారు.

మహిళలు ( Women ) సైతం గర్వంగా ఫీలయ్యేలా ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.ఈ సినిమాలో మాజీ ప్రేయసితోనూ స్నేహాన్ని పొందవచ్చని వాళ్లు శత్రువులు కాదనే పాయింట్ ను చూపించామని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.ఈ సినిమా చేసే క్రమంలో నేను కూడా వ్యక్తిగతంగా కొంతమేర మారానని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ బలంగా ఉంటుందని ఆయన తెలిపారు.

సింపతీ వల్ల సినిమాలు ఆడతాయని చెప్పడం రైట్ కాదని “క” సినిమా ( Ka Movie ) అమ్మ కడుపు మీద చేసిన సినిమా అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.ఈరోజుల్లో ప్రేక్షకులు తెలివైన వాళ్లు అని బలమైన కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తారని ఆయన వెల్లడించారు.ఓ హీరో అరగంట మైక్ పట్టుకుని ఏడిస్తేనే సినిమా హిట్ అవుతుందంటే నేను పది గంటలు ఏడుస్తానని ఆయన పేర్కొన్నారు.







