మొలకెత్తిన గింజలు( Sprouted seeds ).వీటినే ఇంగ్లీషులో స్ప్రౌట్స్ అని పిలుస్తాము.
అయితే స్ప్రౌట్స్ అనగానే చాలా మందికి పెసలే గుర్తుకు వస్తాయి.ఎక్కువగా పెసలనే మొలకెత్తిస్తూ ఉంటారు.
కానీ మొలకెత్తిన పెసలే కాదు మొలకెత్తిన శనగలు కూడా మన ఆరోగ్యానికి కొండంత అండగా నిలబడతాయి.మామూలు శనగల తో పోలిస్తే మొలకెత్తిన శనగల్లో పోషకాలు డబుల్ ఉంటాయి.
అలాగే అవి అందించే ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయి.
ముఖ్యంగా ఆడవారికి మొలకెత్తిన శనగలు( Sprouted chickpeas ) ఒక వరం అనే చెప్పుకోవచ్చు.
మహిళలు వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు మొలకెత్తిన శనగలు తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.శనగల్లో ఉండే ఐసోఫ్లేవోన్( Isoflavone ) అవి మొలకెత్తాక రెట్టింపు అవుతుంది.
ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ లక్షణాలు కలిగి ఉంటుంది.అందువల్ల మహిళలు మొలకెత్తిన శనగలను ఆహారంలో భాగం చేసుకుంటే.
అవి వారిలో వయసుతో పాటు తగ్గే ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను పెంచుతాయి.
అలాగే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో సత్తువ తగ్గిపోతుంది.అయితే మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుంది.ఇది శరీరానికి స్థిరమైన శక్తిని చేకూరుస్తాయి.
నీరసం, అలసట దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.మొలకెత్తిన శనగల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పెద్ద ప్రేగు, రొమ్ము క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.
మొలకెత్తిన శనగల్లో ఉండే విటమిన్ ఎ కంటి శుక్లం, రేచీకటి వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.అధిక ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ కారణంగా మొలకెత్తిన శనగలు మధుమేహాన్ని నివారించడంలో మరియు నిర్వహించడంలో తోడ్పడతాయి.ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి రక్తహీనత బారిన పడకుండా కూడా కాపాడతాయి.అంతేకాకుండా మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ఫోలేట్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలను మనం మొలకెత్తిన శనగల ద్వారా పొందవచ్చు.