ఈ రోజుల్లో అప్పు చేస్తే జీవితకాలం బకాయి తీర్చలేరా..

ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఎవరి దగ్గర అయిన అప్పు చేసి ఉంటారు.చిన్న పెద్ద అవసరాలకు అప్పు చేస్తూనే ఉంటాం.

 Good Days For Borrowing Money According To Vastu Sastram Details, Good Days ,bor-TeluguStop.com

ఇతరుల దగ్గర అప్పు తీసుకోవడం సర్వసాధారణమైన విషయమే.క్రెడిట్ కార్డులు, ఈఏం ఐ లు కూడా అప్పుల క్రిందికి వస్తాయి.

అయితే అప్పు చేసే ముందు కాస్త ఆలోచించి అప్పు చేయడం మంచిది.ఎందుకంటే వాస్తు ప్రకారం వారంలో కొన్ని రోజులు అస్సలు అప్పు తీసుకోకూడదు.

ఎందుకంటే ఆ రోజులలో అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడం ఎంతో కష్టంగా మారిపోతుంది.అందుకే సరైన సమయంలో అప్పు తీసుకోవడం ఎంతో మంచిది.

అప్పు చేసిన వ్యక్తిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల శరీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఒక్కొక్కసారి అప్పులు ఎక్కువ అయితే వాటిని తీర్చ లేక జీవితకాలం ఆ భారాన్ని మోస్తూనే ఉండవలసి ఉంటుంది.అయితే జ్యోతిష్య శాస్త్రంలో అప్పు తీసుకునేందుకు ఇచ్చేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.

శాస్త్రం ప్రకారం శుభ ముహూర్తంలో అప్పు తీసుకుంటే సులభంగా తీర్చవచ్చని చెబుతున్నారు.అయితే ఎప్పుడు అప్పు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా మంగళవారం రోజు అంగారకుడిచే పాలించబడే రోజు కాబట్టి దుష్ట గ్రహంగా అంగార్క గ్రహాన్ని కొంత మంది భావిస్తారు.అంగారకుడు కోపంతో ఉంటాడు.కాబట్టి మంగళవారం అప్పులు తీసుకోవడం అంత మంచిది కాదు.కానీ ఈరోజున పాత రుణాన్ని తిరిగి చెల్లించడం మంచిదే.కాబట్టి మీరు ఎవరికైనా అప్పు బాకయి ఉంటే మంగళవారం దాన్ని చెల్లించడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారాల్లో అప్పు తీసుకుంటే మంచిది.

ఇవే అప్పు తీసుకోవడానికి మంచి రోజులు ఈ రోజుల్లో అప్పు తీసుకుంటే తొందరగా తిరిగి చెల్లించవచ్చు.జ్యోతిష శాస్త్రం ప్రకారం స్వాతి, పునర్వసు, ధనుష్టి, మృగశిర, రేవతి, అనురాధ, అశ్విని నక్షత్రాలలో రుణం తీసుకోవడం వల్ల ఎంతో లాభం వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube