ఆ అలవాటు వలన వీర్యం పాడవుతుంది

స్మోకింగ్ వలన రాని నష్టం ఏముంది.బయటకి కనబడే దంతాలు మాత్రమే కాదు, చర్మం లోపల ఉన్న శరీరభాగలన్నిటికి హాని చేస్తుంది పొగ.

 Smoking Damages Sperm Production-TeluguStop.com

అంతమాత్రమే కాదు, మగవారిలో వీర్యకణాల ఉత్పత్తిని కూడా సిగరెట్లు ప్రభావితం చేస్తాయి.వీర్యాన్ని బలహీనపరుస్తుంది స్మోకింగ్ అలవాటు.

వాషింగ్‌టన్ లో తాజాగా జరిపిన ఒక రిసెర్చ్ లో స్మోకింగ్ వలన వీర్యకణాలకి జరిగే నష్టాన్ని వివరంగా చెప్పారు డాక్టర్లు.ఈ రిసెర్చ్ ని స్మోకింగ్ అలవాటు ఉన్న 20 మగవాళ్ళపై, అసలెప్పుడు సిగరెట్ తాకని 20 మగవాళ్ళపై చేసారు.

సిగరెట్లు తాగే అలవాటు లేని మగవారి వీర్యం ఆరోగ్యంగా ఉంటే, స్మోకింగ్ అలవాటున్న మగవారి పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది.స్మోకర్స్ నుంచి తీసుకున్న వీర్యాన్ని పరీక్షిస్తే, అందులో ఒకరకమైన ప్రోటిన్ పూర్తిగా కనబడకపోగా, 27 ప్రొటీన్ల మోతాదు తక్కువగా, 6 ప్రోటీన్‌ల మోతాదు మరీ ఎక్కువగా కనిపించిందట.

ఇలా ప్రోటీన్‌ల సమతుల్యం లేకపోవడం వలన, వీర్యం బలహీనపడుతుందని, వీర్యకణాల ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉంటుందని వెల్లడించారు డాక్టర్లు.

కాబట్టి మగరాయుల్లు ఎంత త్వరగా పొగత్రాగడం మానేస్తే అంత మంచిది.

చూస్తూ చూస్తూ రోగాలు కొనితెచ్చుకోవడంతో పాటు, భవిష్యత్తుని కూడా పాడు చేసుకోవడం ఎందుకు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube