చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. గేమ్ ఛేంజర్ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అంటూ?

తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్( Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్( Game changer ).ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.

 Sai Madhav Burra Gives Assurance On Game Changer, Game Changer, Sai Madhav Burra-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ ఇండియా సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.ఇక ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అభిమానులకు ప్రతిసారి నిరాశ ఎదురవుతూనే ఉంది.

ఎందుకంటే దర్శకుడు శంకర్ ఈ సినిమాను అంతకంతకు లేట్ చేస్తూనే వచ్చారు.ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమైంది.

Telugu Game Changer, Saimadhav, Tollywood-Movie

పలుమార్లు షెడ్యూల్స్‌కు బ్రేకులు పడ్డాయి.సినిమా గురించి సరైన అప్‌డేట్స్ లేవు.రిలీజ్ గురించి ఎంతకీ క్లారిటీ రాలేదు.అయితే గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఇండియన్ 2 సినిమా( Indian 2 movie ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇండియన్ 2 సినిమా తాజాగా విడుదల అవ్వడంతో రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజెర్ సినిమాపై పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా నీరు కారిపోయినట్టు అయింది.ఎందుకంటే ఇండియన్ 2 సినిమా శంకర్ కెరియర్ లోని అత్యంత విసిగించిన సినిమాగా పేరు తెచ్చుకుంది.

భారీ డిజాస్టర్ గా నిలిచింది.దీంతో గేమ్ చేంజెస్ సినిమాను శంకర్ ఎలా తీర్చిదిద్దారో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అన్న విషయాలు తలుచుకుంటూనే టెన్షన్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు చెర్రీ అభిమానులు.

Telugu Game Changer, Saimadhav, Tollywood-Movie

అభిమానులు ఇలా ఆందోళన చెందుతున్న సమయంలో తాజాగా ఈ సినిమాకు రచయితగా పనిచేసిన సాయి మాధవ్ బుర్ర ( Sai Madhav Burra )ఉపశమనం అందించే విధంగా మాట్లాడారు.గేమ్ చేంజర్ సినిమా ఒక కంప్లీట్ ప్యాకేజీ లా ఉంటుంది.శంకర్ గారి సినిమా నుంచి సగటు ప్రేక్షడు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.ఈ చిత్రం చరణ్ కెరీర్‌ ను మరో స్థాయికి తీసుకెళ్తుంది.

నేను గేమ్ చేంజర్ సెట్స్‌కు రెగ్యులర్‌ గా వెళ్లను.కానీ శంకర్‌ గారితో టచ్‌ లోనే ఉంటాను.

ఆయన తొలిసారి తెలుగులో చేస్తున్న చిత్రమిది.అందుకే తెలుగు డైలాగ్స్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఆయన క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరు.ఉన్నత ప్రమాణాలకు ఏమాత్రం తక్కుగా ఉన్నా అంగీకరించరు.

నాతో శంకర్ గారు తెలుగులోనే మాట్లాడతారు.చాలామంది తెలుగు వారి కంటే ఆయన తెలుగు మెరుగ్గా ఉంటుంది అని సాయిమాధవ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube