చలికాలంలో సాధారణంగా పగలు తక్కువ, రాత్రి ఎక్కువ అని అని అంటూ వుంటారు.దానికి కారణం… శీతాకాలంలో త్వరగా చీకటి పడిపోవడం, ఆలస్యంగా తెల్లారడమే కారణం.
ఐతే కొన్నిసార్లు మీరు గమనించవచ్చు.మరీ త్వరగా చీకటి పడిపోతుందనే అనుమానం కలుగుతుంటుంది.
అలాంటి రోజునే షార్టెస్ట్ డేగా పిలుస్తారు.అయితే ఆ రోజు రానే వచ్చింది… అవును, అది ఈరోజే అని మీరు ఊహించారా? డిసెంబర్ 22 పగలు నిడివి చాలా తక్కువగా ఉంటుందని వినికిడి.కాబట్టి పగటిపూట పనులు ఎమన్నా ఉంటే త్వరగా చేసేసుకోండి మరి.
అయితే ఊరికే ఇలా జరగదట.దానికి కూడా కొన్ని లెక్కలు వున్నాయి.అలాగే సాయంత్రం త్వరగా చీకటి పడిపోయినప్పటికీ నేటి రాత్రి చాలా సుదీర్ఘమైనది.దాదాపు 14 గంటలపాటు రాత్రి కొనసాగుతుంది అన్నమాట.కారణం తెలియాలంటే మనం ఖగోళ శాస్త్రం చదవాల్సిందే.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.సూర్యుని చుట్టూ తిరుగుతుంటుందని చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు కదా.ప్రతి ఏటా డిసెంబర్ 21 లేదా 22 తేదీల్లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.దీంతో ఉత్తర అర్ధగోళంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా (శీతాకాలం) ఉంటుందన్నమాట.

అలాగే భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న భాగం వైపు వేసవి కాలం ఉంటుంది.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈరోజుని అతి పెద్ద రోజుగా పరిగణిస్తారు.అంటే దీని తర్వాత భూమి ఉత్తరార్ధగోళం వైపు కదులుతాడు.దీని కారణంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగలు పొడవు క్రమంగా పెరగడంతో రాత్రి సమయం తగ్గడం స్టార్ట్ అవుతుంది.
ప్రతి ఏడాది ఈ విధంగా డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22 తేదీల్లో జరుగుతుందనే విషయం మీరు తెలుసా? గత ఏడాది (2020) డిసెంబర్ 21న సుదీర్ఘ రాత్రి వచ్చింది.కాగా ఈ సంవత్సరానికి డిసెంబర్ 22న ఈ రోజు వచ్చింది.







