సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు తరచు కొన్ని విషయాలను మనకు తెలియజేస్తూ ఇలా చేయడం చెడుకు సంకేతం అని చెబుతుంటారు.అయితే వారు చెప్పే విషయాలను మనం కొట్టిపారేస్తూ వారి మాటలను పెడచెవిన పెట్టి మన పనులను కొనసాగిస్తుంటారు.
అయితే కొన్ని సార్లు మన పనులలో ఎన్నో ఆటంకాలు, అరిష్టాలు జరుగుతాయి.అలాంటి సమయంలో మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు గుర్తు చేసుకొంటాము.
ఈ క్రమంలోనే మన ఇంట్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎంతో అదృష్టమని పెద్దలు చెబుతుంటారు.మరి ఆ సంఘటనలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.
మనం ఏదైనా శుభకార్యాల నిమిత్తం లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఇంటిలో గాజు వస్తువులు లేదా అద్దం పగులుతుంది.ఇలా పగలటం అశుభానికి సంకేతం.
ఇలా పగలడం తర్వాత మనం అదే పనులను కొనసాగిస్తే ఆ పనులలో తప్పకుండా ఆటంకాలు, కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.అదేవిధంగా కొందరి ఇళ్ళల్లో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి.
ఇలా పాలు పొంగిపోవడం అరిష్టం.
అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులు కుక్కలు పిల్లులు తరుచు గట్టిగా అరవడం లేదా పోట్లాడటం చేస్తుంటే మన ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని అర్థం.
ఇలాంటి సమయాలలో ఎంతో అప్రమత్తంగా ఉండడం లేదా మనం ఏదైనా పనులను చేయాలని భావిస్తే ఆ ముఖ్యమైన పనులను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది.అలాగే కొందరు బయటకు వెళ్ళే సమయంలో తుమ్ముతారు.
ఇలా తుమ్మడం చెడుకు సంకేతం.కనుక మన ఇంట్లో ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగితే అది చెడు సంకేతమని భావించాలి.