బిర్యానీ ఆకు( Bay leaf ).దీన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇంగ్లీష్ లో బిర్యానీ ఆకులను బే లీవ్స్ అని పిలుస్తారు.స్పెషల్ రైస్ ఐటమ్స్ తో పాటు చికెన్, ఫిష్, మటన్ వంటి నాన్ వెజ్ వంటల్లో కచ్చితంగా బిర్యానీ ఆకును ఉపయోగిస్తుంటారు.
ఆహారం రుచి మరియు వాసన పెంచడానికి బిర్యానీ ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే బిర్యానీ ఆకులో జింక్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) కూడా పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యానికి బిర్యానీ ఆకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
అయితే బిర్యానీ ఆకును ఆహారంలో కాకుండా ఇంట్లో కాల్చడం వల్ల కూడా ఎన్నో ఆశ్చర్యపోయే లాభాలు పొందుతారు.అవును బిర్యానీ ఆకును కాల్చినప్పుడు దాని నుండి వెలువడే పొగ మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.రోజుకు రెండు బిర్యానీ ఆకులు ఇంట్లో కాల్చారంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.
బిర్యానీ ఆకుల్లో లినాలూల్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది.ఇది మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.మన మూడ్ ను ఇట్టే చేంజ్ చేస్తుంది.
అలాగే బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఇంట్లో గాలి శుద్ధి అవుతుంది.చెడు వాసన రాకుండా ఉంటాయి.చాలామంది ఇంట్లో మంచి సువాసన రావడానికి ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్స్( Air fresheners ) కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ వాటిలో రసాయనాలు, కృత్రిమ సువాసనలు ఉంటాయి.వాటి పీలిస్తే భయకరమైన జబ్బులు తలెత్తుతాయి.కానీ, వాటికి బదులు బిర్యానీ ఆకులు వాడితే ఇంట్లో మంచి సువాసన వస్తుంది.పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
అంతేకాదు బిర్యానీ ఆకులను కాల్చినప్పుడు ముఖ్యమైన నూనెలు మరియు ఫైటోన్యూట్రియెంట్స్ వంటి సుగంధ సమ్మేళనాలను విడుదల చేస్తాయి.ఇవి మెదడు నరాలను రిలాక్స్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి.
శాంతి మరియు బుద్ధిపూర్వక భావాన్ని పెంపొందిస్తాయి.పైగా ఇంట్లో రోజు రెండు బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల దోమలు, ఈగలు విసిగించకుండా సైతం ఉంటాయి.