సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దర్శకుడు గౌతం మీనన్( Gautham Menon ) ఒకరు.2001లో మాధవన్ నటించిన మిన్నెలే తో దర్శకుడిగా పరిచయం అయిన ఈయన అనంతరం ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి దర్శకుడిగా గుర్తింపు పొందారు.ఇకపోతే ఇటీవల కాలంలో గౌతమ్ మీనన్ సినిమాలకు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాయి.ఈ క్రమంలోనే ఈయనకు ఏలాంటి సినిమా అవకాశాలు కూడా రాలేదని చెప్పాలి.
ఇక ఈయన దర్శకుడిగా( Director ) మాత్రమే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది.ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు.నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం.నేను చేసిన ధ్రువ నక్షత్రం( Dhruva Nakshatram ) సినిమా సమయంలో ఎవరూ కూడా నా సినిమాను పట్టించుకోలేదు కనీసం నా సినిమాకు ఉన్న సమస్యల గురించి కూడా ఎవరు అడిగి తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం ఏం జరుగుతుందోనని తెలుసుకోవడానికి కూడా ఇండస్ట్రీలో ఎవరు ప్రయత్నం చేయలేదని ఆ విషయం తనను చాలా బాధ కలిగించిందని తెలిపారు.ధనుష్,( Dhanush ) లింగుస్వామి( Lingusamy ) మాత్రమే దీని గురించి అడిగారు.విడుదల చేయడానికి ప్రయత్నించారు.కొన్ని స్టూడియోల వారికి ఈ సినిమాను చూపించాను.కొన్ని సమస్యలు ఉన్నందున ఎవరు కూడా ఈ సినిమాని తీసుకోలేదని అందుకే ఈ సినిమాని విడుదల చేయలేకపోయానని తెలిపారు.ప్రేక్షకులు ఇంకా నా సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను ఇంకా బ్రతికి ఉన్నాను అంటూ గౌతమ్ మీనన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.