శ్రీలంకలో( Sri Lanka ) దౌలగాలా గ్రామంలో గడిచిన శనివారం నాడు చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది.పాఠశాలకు వెళుతున్న ఓ టీనేజ్ బాలిక పట్టపగలు కిడ్నాప్( Kidnap ) చేయబడింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్( Viral Video ) అవుతోంది.వీడియోలో ఒక టీనేజ్ అమ్మాయి తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళ్తోంది.
ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక వ్యాన్ ఆగింది.వ్యాన్‌లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి విద్యార్థిని( Student ) బలవంతంగా కారు లోకి తోసేసాడు.
ఈ ఘటన చూసిన ఓ వ్యక్తి దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి బాలికను రక్షించేందుకు ప్రయత్నించాడు.
అయితే, కిడ్నాపర్లు వ్యాన్‌ను స్టార్ట్ చేయడంతో అతనిని కూడా తీసుకెళ్లారు.కిడ్నాపైన అమ్మాయితో పాటు ఉన్న మరో అమ్మాయి.కిడ్నప్ చేసిన అమ్మాయిని కారులో వేయడంతో ఆ అమ్మాయి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది.
అలాగే మరో అబ్బాయి ఎదురుగా వస్తున్న గాని ఆ విషయంపై పెద్దగా శ్రద్ధ వహించకుండా వెళ్లాలనుకున్నాడు.కాకపోతే, కిడ్నాపర్స్ తో పోరాడడానికి వచ్చిన అబ్బాయిని చూసి అతను కూడా వెళ్లడానికి ప్రయత్నించిన అందులోకే కారు అక్కడి నుంచి కదిలి వెళ్ళింది.
ఈ ఘటనలో బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి బాధితురాలి బంధువుగా గుర్తించినట్లు తెలిసింది.కిడ్నాప్ వెనుక కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు.పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన వీడియో సామాజిక మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బాలిక భద్రత గురించి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, బాధితురాలిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించారు.
అనుమానితుడిని ట్రాక్ చేయడానికి సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు.ఇలాంటి ఘటనలు ప్రజల భద్రత పట్ల ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.