పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్

వృత్తి , ఉద్యోగ , వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు( NRI’s ) జన్మభూమికి సేవ చేస్తున్న సంగతి తెలిసిందే.వీరి వల్ల దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యంతో పాటు కంపెనీలు స్థాపించి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

 Nri Interest Driving Real Estate Growth In Kerala Thiruvananthapuram Details, Nr-TeluguStop.com

ఇక దేశంలోనూ వీరు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి భారతేదశ ఆర్ధిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ముఖ్యంగా రియల్ ఎస్టేట్( Real Estate ) రంగంలో ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు.

2024లో కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (K-RERA) కింద నివాస యూనిట్ రిజిస్ట్రేషన్‌లలో తిరువనంతపురం( Thiruvananthapuram ) జిల్లా అగ్రగామిగా నిలిచింది.అక్కడ 2,987 యూనిట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయట.

ఎర్నాకుళం సహా ఇతర జిల్లాల్లో 2,864 మాత్రమే నమోదు చేశాయట.ఈ గణాంకాలు తిరువనంతపురంలో నివాస ఆస్తులకు డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.

దీనికి ప్రవాస భారతీయులే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

Telugu Ernakulam, Kerala, Keralaestate, Nri Estate, Nris, Estate-Telugu NRI

సాంప్రదాయకంగా కేరళ రియల్ ఎస్టేట్ హబ్‌గా పిలువబడే ఎర్నాకుళంలో( Ernakulam ) బలమైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ, మహానగరం అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు తగ్గాయి.దీనికి విరుద్ధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటంతో, సరసమైన ధరల్లో గృహాలు, పరిపాలనా, ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతుండటం వంటి అంశాలతో తిరువనంతపురంలో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి.ఇదే సమయంలో ఎన్ఆర్ఐలు కూడా త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

Telugu Ernakulam, Kerala, Keralaestate, Nri Estate, Nris, Estate-Telugu NRI

రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.జీవనశైలి, ఉన్నతమైన విద్యాసంస్థలు, ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల నేపథ్యంలో తిరువనంతపురాన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.పలు దేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత సెటిల్ కావడానికి త్రివేండ్రం అత్యంత అనుకూలంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.వీరితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తమిళనాడు ప్రజలు కూడా తిరువనంతపురానికి రావడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్‌కు కారణమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube