టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) హీరోగా నటించిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ను తెచ్చుకుంది.
తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.సినిమా రివ్యూలు కూడా పాజిటివ్గా రావడంతో థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య బాబు గుర్రం మీద వస్తూ డాకు పాత్రలో చేసిన యాక్షన్స్ సన్నివేశాలు నిజంగా అభిమానులకు తెప్పించాయని చెప్పాలి.అయితే చాలా మందికి ఇప్పటికీ ఈ డాకు పాత్ర రియల్ అని తెలియదు.
అవును ఇది నిజంగానే ఒక వ్యక్తి ఆధారంగా రాసుకున్న క్యారెక్టరట.
ఆయన పేరే డాకు మాన్ సింగ్.( Daaku Maan Singh ) డాకు మాన్ సింగ్ 1890 ఆగ్రాకి 50 కిలో మీటర్ల దూరంలోని ఖేరా రాథోడ్ గ్రామంలో ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించాడు.ఛంబల్ ప్రాంతంలో పెరిగాడు.
చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్న డాకు ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలిచేవాడు.అలానే నాయకుడిగా ఎదుగుతూ వచ్చాడు.చంబల్ లో ఉండే 17 మందితో కలిసి ఒక దోపిడి ముఠాని ఏర్పాటు చేశాడు డాకు.16 ఏళ్లలో 1112 దోపిడీలు, 185 హత్యలు చేశాడు.ఈ లిస్ట్ లో 32 మంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు.ఇక ఎన్నో కిడ్నాప్ లు కూడా చేశాడు డాకు.నాలుగు రాష్ట్రాలకి చెందిన వందలాది మంది పోలీసులు దాదాపు 15 ఏళ్ల పాటు డాకుని పట్టుకోవడానికి వెతికారు.అలా పోలీసులకి చిక్కుండా తప్పించుకు తిరుగుతున్న డాకుని ఎట్టకేలకి పోలీసులు కాల్చి చంపారు.
ఒకరోజు డాకు సింగ్, అతని కుమారుడు సుబేదార్ సింగ్ చెట్టు కింద కూర్చొని ఉండగా పోలీసులు కాల్చి చంపారు.
ఇందుకోసం పోలీసులు ఒక స్పెషల్ టీమ్‌గా ఏర్పడి ఈ ఆపరేషన్ చేశారు.అయితే డాకు సింగ్ చనిపోయిన తర్వాత సంచలన విషయాలు బయటకొచ్చాయి.పోలీస్ రికార్డుల్లో అత్యంత కిరాతకుడిగా పేరున్న డాకు కొన్ని వేల మందికి సాయం చేశాడు.
కూడు, గూడు ఏర్పాటు చేసి గ్రామాలకి గ్రామాలనే బాగు చేశాడు.తాను దోచుకున్న ధనాన్ని చాలా వరకూ ప్రజా సేవకే ఖర్చు పెట్టాడు.
ఇలా చట్టం దృష్టిలో నేరస్థుడైన డాకుని ఎన్నో వేల మంది ప్రజలు దేవుడిగా కొలుస్తారు.అయితే డాకు మాన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో అప్పట్లో ఒక సినిమా కూడా వచ్చింది .బాబు బాయ్ మిస్తీ డైరెక్షన్ లో 1971లో డాకు మాన్ సింగ్ అనే సినిమా తీశారు.ఇందులో దారా సింగ్ డాకుగా నటించారు.
అలానే 2019 లో వచ్చిన సోంచిరియా సినిమాలో( Sonchiriya Movie ) మనోజ్ బాజ్‌పాయ్ డాకు సింగ్ క్యారెక్టర్ చేశారు.ఇప్పుడు తెలుగులో బాలకృష్ణ డాకు మహారాజ్ అంటూ ఆయన పాత్రని పోషించారు.
అయితే పూర్తిగా ఇది డాకు సింగ్ కథ కాదు.ఆయన పాత్ర నుంచి స్ఫూర్తి తీసుకొని కథని డిఫరెంట్ గా మలిచాడు డైరెక్టర్ బాబీ.