సాధారణంగా నార్త్ సైడ్ చపాతీలను( Chapatis ) ఎక్కువగా తింటుంటారు.కానీ ఇప్పుడు దేశమంతటా చపాతీలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
వైట్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు, బరువు తగ్గాలని ఇంకొందరు.నైట్ చపాతీలు చేసుకుని తింటున్నారు.
ముఖ్యంగా చపాతీ, ఆలూ కర్రీ కాంబినేషన్ చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు.మీరు కూడా రోజు చపాతీలను ఆలూ కర్రీతో తింటున్నారా.
అయితే కచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసుకోవాల్సిందే.

వెయిట్ లాస్( Weight Loss ) అవ్వడానికి డైట్ ఫాలో అయ్యేవారు చపాతీలను ఆలూ కర్రీతో అస్సలు తినకూడదు.ఎందుకంటే బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.అందువల్ల చపాతీలను ఆలూ కర్రీతో తింటే బరువు తగ్గడం కాదు పెరుగుతారు.
కాబట్టి ఆలూ కర్రీ( Aloo Curry )కి బదులుగా పప్పు, పన్నీర్, ఎగ్ ఇలా ఇతర కర్రీస్ ను ఎంచుకోవడం మంచిది.
అలాగే మరొక విషయం ఏమిటంటే మార్కెట్లో దొరికే గోధుమపిండి( Wheat Flour ) వంద శాతం ప్యూర్ గా అయితే ఉండదు.
కచ్చితంగా అందులో ఎంతో కొంత మైదా కలుస్తుంది.అటువంటి గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను తీసుకుంటే లాభాలు కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.అందుకే మార్కెట్లో దొరికే గోధుమ పిండికి బదులుగా మీరే గోధుమలను కొనుక్కొని పిండిని తయారు చేసుకోవడం ఉత్తమం.

స్వచ్ఛమైన గోధుమ పిండిని వాడితే చాలా లాభాలు ఉన్నాయి.ఈ గోధుమపిండి తో తయారు చేసిన చపాతీలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు( Blood Sugar Levels ) ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.
గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే స్వచ్చమైన గోధుమ పిండిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.