ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ( Rohit Sharma ) నేతృత్వంలోని బరిలోకి దిగబోతున్న టీమ్ ఇండియా తన సత్తాని చాటడానికి మానసికంగా, శరీరకంగా సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో మన భారత్ టీమ్ ప్రచారాలకు సైతం సిద్ధంగా ఉంది.
అంతకు ముందు సోమవారం ఆటగాళ్లు ప్రపంచ కప్ కిట్‌ను ధరించి ఫోటోషూట్ నిర్వహించిన సంగతి మీకు తెలిసే వుంటుంది.ఆ సమయంలో ప్రతి ఒక్కరూ తమ పలు యాంగిల్స్‌లో పోజులిస్తూ, సరదాగా ఫొటో షూట్ పూర్తి చేశారు.
కాగా దీనికి సంబంధించిన వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే భారత జట్టు తన చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను మంగళవారం నెదర్లాండ్స్‌తో ఆడనుందనే విషయం అందరికీ తెలిసినదే.అయితే, ఈ మ్యాచ్ కూడా వర్షంతో రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదు.ఇప్పటి వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు.
ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దైంది కూడా.దీంతో 5 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌నకు వార్మప్ మ్యాచ్‌లు ఆడకుండానే టీమిండియా బరిలోకి దిగబోతోంది.
అయితే, విరాట్ కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్ల ఫొటోషూట్ జరిగింది.

ఇక అక్టోబర్ 2 వరకు తిరువనంతపురంలో ఉన్న జట్టుతో కోహ్లి చేరలేదు.దీంతో ఆయన ఈ ఫొటో షూట్‌లో పాల్గొనలేదు.కాగా ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఆటగాళ్లను షూట్ లొకేషన్‌కు తీసుకొచ్చినట్లు ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు.
ఆ తర్వాత ఒక్కొక్కరుగా కెమెరా ముందు పోజులు ఇస్తూ తమ ఫొటోలను క్లిక్ మానిపించగా సరిగా ఆ సమయంలో మహ్మద్ సిరాజ్( Mohammed Siraj ) తన ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని ప్రదర్శించడం కొసమెరుపు.సూర్యకుమార్ యాదవ్ కూడా ఫొటోలు తీశాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య సీరియస్‌గా చర్చలు కూడా జరిగాయి.కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ సహా జట్టులోని ఇతర ఆటగాళ్లు చాలా మంచి మూడ్‌లో వున్నట్టు స్పస్టమౌతోంది.







