1. నీట్ పీజీ కౌన్సిలింగ్ వాయిదా
నేటి నుంచి జరగాల్సిన నీట్ పీజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది.
2.కడప జిల్లాలో జగన్ పర్యటన

నేటి నుంచి మూడు రోజులపాటు ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.
3.రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు
గుంటూరు లయోలా స్కూల్ ఆవరణలో నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరగనున్నాయి.
4.ఋషి పంచమి వ్రతం

నంద్యాల లోని మహా నంది క్షేత్రంలో నేడు ఋషి పంచమి వ్రతం జరగనుంది.
5.భారత్ లో కరోనా
గడిచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7,231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.తెలంగాణ లో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.సోము వీర్రాజు కృతజ్ఞతలు
ఏపీలోని కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
8.ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ విధానం

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బయో మెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని తెలిపారు.
9.దావూద్ ఇబ్రహీం పై 25 లక్షల రివార్డు
మాఫియా డాన్ దావత్ ఇబ్రహీం పై 25 లక్షల రివార్డును ఎన్ ఐ ఎ ప్రకటించింది.
10.టిఆర్ఎస్ కు మద్దతు: సిపిఎం

మునుగోడు అసెంబ్లీ ఒక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
11.నాగార్జునసాగర్ పది ట్రస్ట్ గేట్ల ఎత్తివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతి కొనసాగుతోంది .దీంతో 10 క్రస్ట్ గేట్ల ను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
12.కామారెడ్డి జిల్లాలో నేడు కేంద్ర మంత్రి పర్యటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మూడు రోజులపాటు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆమె పరిశీలన చేయనున్నారు.
13.మంత్రి హరీశ్ రావు ను బర్తరఫ్ చేయాలి
ఇబ్రహీం పట్టణంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలం అయ్యి కొంతమంది .అహిలలు మరణించడం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును భర్తరఫ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
14.కేంద్రానికి యనమల రామకృష్ణుడి లేఖ

కేంద్రానికి టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.కాకినాడ సెజ్ లో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ తో కాలుష్యం తీవ్రంగా ఏర్పడుతుంది అని లేఖ లో పేర్కొన్నారు.
15.పది రోజులపాటు దసరా ఉత్సవాలు
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు 10 రోజులపాటు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
16.గడప గడపకు కాంగ్రెస్

నేటి నుంచి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో గడపగడపకు కాంగ్రెస్ క్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేపట్టారు.
17.నేడు టిడిపి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
నేటి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు చేపట్టింది.
18.శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం కు వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్ట్ లోని నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
19.నంద్యాల జిల్లాలో పులి సంచారం
నంద్యాల జిల్లా గడివేముల మండలం ఒండుట్ల గని గ్రామాల మధ్య చిరుత పులి సంచారం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,500 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,730
.