ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఏ ఫంక్షన్ లో కనిపించినా ప్రతి ఒక్కరూ పెళ్లి( Marriage ) ఎప్పుడు చేసుకుంటారు అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి వయసు రాగానే అమ్మాయిల, అబ్బాయిల కోసం వెతుకుతూ ఉంటారు.
మంచి సంబంధం వచ్చి అమ్మాయి, అబ్బాయి ఒకరికి ఒకరు ఇష్టపడితే పెళ్లి వేడుకలను ఘనంగా మొదలు పెడతారు.కట్నకానుకలు నిర్ణయించిన మరుక్షణమే నిశ్చితార్థం, వివాహ తేదీలను సెట్ చేసుకుంటారు.

అయితే ఆ జంట నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో పిల్లాపాపలతో వర్ధిల్లాలని ఉద్దేశంతో నిశ్చితార్థం వివాహాలను శుభముహూర్తంలోనే చేసుకునేందుకు పెద్దవారు ఆసక్తి చూపిస్తారు.ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ పెళ్లిళ్లను చేయరు.కాబట్టి జ్యోతిష్య పండితులను సంప్రదించి నిశ్చితార్థానికి, పెళ్లి కి ముహూర్తాలను( Shubh Muhurat ) ఫిక్స్ చేసుకుంటారు.అమ్మాయి అబ్బాయి ల జతకల ప్రకారం పండితులు కూడా నిశ్చితార్థం, వివాహ తేదీలను నిర్ణయిస్తారు.
కాబట్టి చాలామంది ఈ తేదీలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ( Sankranti Festival ) అయిపోయిన తర్వాత ప్రతి నెలలో వివాహాలు బాగానే జరిగాయి.

ఇక ఏప్రిల్ నెలలో( April Month ) కూడా వివాహాలు చేసేందుకు ముహూర్తాలను చూసుకుంటున్నారు.ఏప్రిల్ లో ఉగాది పండుగ( Ugadi ) తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 18 గురువారం అర్ధరాత్రి 12గంటల 44 నిమిషాల నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 5 గంటల 51 నిమిషంలో వరకు,అలాగే ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ఉదయం 5గంటల 41 నిమిషముల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు, అలాగే ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి ఏప్రిల్ 21వ తేదీ తెల్లవారు జామున 2:48 నిమిషాల వరకు, అలాగే ఏప్రిల్ 21వ తేదీ అర్ధరాత్రి 3:45 నిమిషముల నుంచి ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 5 గంటల 48 నిమిషాల వరకు, ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 5:40 నుంచి రాత్రి 8 గంటల వరకు వివాహానికి శుభ ముహూర్తాలు ఉన్నాయి.