మధుమేహం లేదా చక్కెర వ్యాధి.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని పట్టిపీడుస్తున్న సమస్య ఇది.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శారీరక శ్రమ లేక పోవడం, మద్యపానం, ధూమపానం వంటి రకరకాల కారణాల వల్ల కొందరు చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతుంటారు.ఏదేమైనా ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవిత కాలం వేధిస్తూనే ఉంటుంది.
ఇకపోతే ప్రస్తుత వేసవి కాలంలో చక్కెర స్థాయిలను అదుపు చేసుకోవడం మధుమేహులకు ఎంతో కష్టతరంగా మారుతుంటుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకుంటే.
చాలా అంటే చాలా సులభంగా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక టమాటో, ఒక కీరదోస, ఒక చిన్న సైజ్ కాకరకాయ తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.
అందులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, హాఫ్ లీటర్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమం నుంచి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకుని డైరెక్ట్‌గా సేవించాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే గనుక.రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ తప్పకుండా ఉంటాయి.
అంతే కాదండోయ్.టమోటా, కీరదోస, కారకకాయ కాంబినేషన్ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.శరీరంలో పేరుకు పోయిన కొవ్వంతా కరిగిపోయి వెయిట్ లాస్ అవుతారు.గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.
కంటి చూపు మెరుగు పడుతుంది.మరియు వేసవి వేడిని తట్టుకునే శక్తి సైతం లభిస్తుంది.
కాబట్టి, మధుమేహం వ్యాధి ఉన్న వారే కాదు.ఎవ్వరైనా పైన చెప్పిన జ్యూస్‌ను తయారు చేసుకుని తీసుకోవచ్చు.