Oily Skin : మీ మొహం జిడ్డుగా ఉందా..? జిడ్డు పోయి నిగనిగలాడించే టిప్స్...

అందరిలో అందంగా కనిపిస్తే చాలా మంది ధైర్యాంగా ఉండగలుగుతారు.జిడ్డు మొహం, జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వల్ల నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండలేరు చాలా మంది.

 Amazing Beauty Tips For Oily Skin,oily Skin,beauty Tips, Rose Water,multani Mitt-TeluguStop.com

మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మన లుక్స్ చాలా ముఖ్యం.అందంగా లేకపోయినా కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా అమ్మాయిలు ఈ అందం విషయంలో చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు.అందుకే జిడ్డు చర్మం కలవారి కోసం మా చిన్న టిప్స్…
కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం జిడ్డుగా ఉంటుందని బాధపడుతుంటారు.

అలాంటివారు కొన్నిచిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతగా మారుతుంది.ప్రతీ ఒక్కరూ కోరుకునేదే ఇది.అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్​ ప్యాక్​లు వాడినా తమ చర్మం జిడ్డుగా ఉంటుందని బాధపడుతుంటారు.అలాంటివారు కొన్నిచిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతగా మారుతుంది.

జిడ్డుగల చర్మం ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్ తో తప్పనిసరిగా శుభ్రపరుస్తారు.జంగ్​ ఫుడ్​ ఎక్కువ తినకూడదు.

నూనె ఎక్కువ లేని ఆహారం, మిరప లాంటి కారంగా ఉండే ఆహారాన్ని తినవద్దు.క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ప్రాణాయామం చేయండి.

మీ ముఖాన్ని దుమ్ము , సూర్యకాంతి నుంచి రక్షించండి.

Telugu Tips Oily Skin, Tips, Citrus Fruit, Multani Mitti, Oily Skin, Oilyskin, P

ముఖాన్ని మంచినీటితో రోజుకు 3-4 సార్లు కడగాలి.రోజ్ వాటర్ సహజంగా, ఆరోగ్యానికి మంచిది.ఇది చర్మంలోని నూనెను తగ్గించి చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం, రోజ్ వాటర్‌లో యాంటీమైక్రోబయాల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.జిడ్డు గల చర్మాన్ని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది.

రోజ్ వాటర్‌ లో కాటన్ బాల్ లేదా కాటన్ ఉన్ని చిన్న ముక్కను నానబెట్టి ముఖాన్ని శుభ్రపరచండి.ఇలా చేయడం ద్వారా, ముఖ చర్మం వికసిస్తుంది చర్మం లో ఉండే జిడ్డుని పూర్తిగా తొలగిస్తుంది.

ఇప్పుడు మరికొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

Telugu Tips Oily Skin, Tips, Citrus Fruit, Multani Mitti, Oily Skin, Oilyskin, P

ముల్తానీ మట్టిలో ఉండే పుష్కలమైన ఖనిజాలు జిడ్డుగల చర్మంపై అద్భుతంగా పనిచేస్తాయి.ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ చర్మం నుంచి నూనెను గ్రహిస్తుంది.అదనంగా సహజ సౌందర్యాన్ని ఇస్తుంది.

ఇది మొటిమలను తొలగిస్తుంది.మచ్చలను తేలిక చేస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో వేపకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు భావిస్తారు.వేప ఆకులు, దాని రసంతో తయారైన ఆయుర్వేద మందులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అలాగే, శరీర సౌందర్యాన్ని పెంచడానికి వేపను కూడా ఉపయోగిస్తారు.జిడ్డు గల చర్మం వాళ్లు ఈ వేప ప్యాక్​ కూడా చాలా ఉపయోగపడుతుంది.

విటమిన్-సి యొక్క ఉత్తమ మూలం కమల అని అందరికీ తెలుసు, కాని నారింజ చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లను ప్రసారం చేయడంలో సహాయపడుతుంది.కమలా కాయ పై తొక్కతో చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మం నుంచి అదనపు నూనెను తొలగించడమే కాకుండా, ముఖంపై ఉండే మచ్చలు తగ్గించడానికి కూడా పని చేస్తాయి.

Telugu Tips Oily Skin, Tips, Citrus Fruit, Multani Mitti, Oily Skin, Oilyskin, P

బొబ్బాసి కాయ ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా, జిడ్డుగల చర్మం కోసం ఆయిల్​ స్కిన్ ఫేస్​ ప్యాక్​ కోసం కూడా ఉపయోగపడుతుంది.అబ్బాస్ కాయల విటమిన్-కె, సి, పొటాషియం, ఫోలిక్ ఆమ్లం వంటి పోషక లక్షణాలు ఉన్నాయి.అదనంగా, ఇది సిలికాన్ అనే ప్రత్యేక మూలకాన్ని కలిగి ఉంటుంది, ఇది చర్మకాంతిని పెంచడానికి సహాయపడుతుంది.బొబ్బాసి కాయ రసం చర్మానికి ఉత్తమమైన టానిక్‌గా పరిగణించబడుతుంది, ఇది ముఖం మీద తాజాదనాన్ని అనుభూతి కలిగిస్తుంది.

సో జిడ్డు చర్మం గలవారు ఈ చిట్కాలు పాటిస్తే ముఖంలో ఛాయ కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube