మామిడి పండ్లను ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.. తెలుసా?

మామిడి పండ్లు( Mangoes ) అంటే ఇష్టపడని వారు ఉండరు.పండ్లలోనే రారాజు అయిన మామిడి పండ్లు ప్రస్తుత వేస‌వి కాలంలో విరి విరిగా లభ్యం అవుతుంటాయి.

 If You Take Mangoes Like This, You Will Lose Weight! Mangoes, Mango Benefits, La-TeluguStop.com

వేసవి కాలాన్ని మామిడి పండ్ల సీజన్ అని కూడా పిలుస్తుంటారు.మామిడి పండ్ల రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

అలాగే మామిడి పండ్లలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అయితే మామిడి పండ్లను తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ కారణంగా కొందరు మామిడి పండ్లు ఎంత ఇష్టం ఉన్నా సరే దూరం పెడుతుంటారు.

Telugu Tips, Latest, Mango Benefits, Mangopineapple, Mangoes-Telugu Health

కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా మామిడి పండ్లను తీసుకుంటే వెయిట్ గెయిన్ కాదు వెయిట్ లాస్ అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం మామిడి పండ్లను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక మామిడి పండును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, ఒక కప్పు బాగా పండిన పైనాపిల్ ముక్కలు( Pineapple ) వేసుకోవాలి.

Telugu Tips, Latest, Mango Benefits, Mangopineapple, Mangoes-Telugu Health

అలాగే ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు( Almond Milk ), వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మ్యాంగో పైనాపిల్ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Telugu Tips, Latest, Mango Benefits, Mangopineapple, Mangoes-Telugu Health

మామిడి పండ్లు నేరుగా కాకుండా ఈ విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదు, ఈ స్మూతీ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుముఖం పడుతుంది.ఆడవారిలో నెలసరి సమస్యలు దూరం అవుతాయి.క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మెదడు చురుగ్గా మారుతుంది.జీర్ణ‌ వ్యవస్థ ప‌ని తీరు సైతం మెరుగుప‌డుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube