మనదేశంలోని చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని చాలా బలంగా నమ్ముతారు.ఇంట్లోని ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే అలంకరించుకుంటారు.
వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులు లేకపోతే ఏవైనా అనర్ధాలు జరుగుతాయని బలంగా నమ్ముతారు.ఇంట్లో వస్తువులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా అస్సలు ఉంచారు.
ప్రతి వస్తువును భద్రంగా ఒక ప్రదేశంలో ఉంచాలని నియమాలను పాటిస్తూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారమే ఇంట్లోని వస్తువులను అమర్చడానికి మనదేశంలోని చాలామంది ప్రజలు ఇష్టపడతారు.
ఇళ్లంతా ఎలా పడితే అలా చెత్తాచెదారంలా పెట్టడం వల్ల ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని చాలామంది నమ్ముతారు.ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే ఇంటిపైన ఉండే ప్రదేశంలో పనికిరాని చెత్తను ఉంచడం అనర్ధమే అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా చెత్తతో నిండిపోతే ఆ ఇంట్లోని వారికి ఎవరికీ మంచిది కాదని చెబుతున్నారు.ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల్లో ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది.స్టోర్ రూమ్ లో కూడా వస్తువులను చిందర బందరుగా ఉంటే మాత్రం ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.ఇంటిపైన పాడైపోయిన వస్తువులను ఎట్టి పరిస్థితులలో ఉంచకూడదు.
విరిగిన కుర్చీలు, బల్లలను ఉంచడం వల్ల దుష్ప్రభావాలు జరుగుతాయని వాస్తు ని పనులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇంటి పైన భవిష్యత్తులో ఉపయోగపడే వస్తువులను ఉంచుకోవాలంటే ఆ వస్తువులపై ఏదైనా గుడ్డను కప్పుకోవడం మంచిది.అసలు వాడని వస్తువులను మిద్దపై ఉంచడం వల్ల మనపై భారం పెట్టుకున్నట్లే అవుతుంది.అందుకే ఇంటి పై కప్పు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇలాంటి అనర్ధాలు ఏవి జరగవు అని వాస్తు శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు.