ప్రతి రోజు తిరుమల పుణ్యక్షేత్రానికి ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati ) శుభవార్త చెప్పింది.ఇప్పటికే టీటీడీ శ్రీవారి అర్చిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ విడుదల చేసింది.

అందులో భాగంగా ఈ నెల 24న రెండు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా విడుదల చేయనుంది.దీంతో పాటు తిరుపతిలో గదులకోట విడుదల తేదీని కూడా ప్రకటించింది.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.ఈ సమయంలో టిటిడి పలు నిర్ణయాలు తీసుకుంది.మన దేశంలో చాలా ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండుగా ఉన్నాయి.టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తిరుమల ముఖ్య అధికారులు తెలిపారు.
శనివారం రోజు స్వామివారిని దాదాపు 72,000 మంది భక్తులు( Devotees ) దర్శించుకున్నారు.అలాగే స్వామి వారికి కానుకల ద్వార వచ్చిన హుండీ ఆదాయం దాదాపు రెండున్నర కోట్లు అని అధికారులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే జూలై, ఆగస్టు నెలలకు చెందిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మే 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్( TTD) లో విడుదల చేయనుంది.భక్తులు ఈ విషయాన్ని గమనించి అధికారిక వెబ్సైట్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.అలాగే శ్రీవాణి,అంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదల చేయనున్నారు.అలాగే తిరుపతిలో గదుల కోటాను మే 25న, తిరుమలలో గదులకోట 26న విడుదల చేయడం జరుగుతుందని తిరుమల దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.