కలియుగ దైవంగా భావించే శ్రీవారి సన్నిధి తిరుమలకు( Tirumala ) ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.ప్రత్యేక రోజుల్లో అయితే మడ విధులు నిండిపోతు ఉంటాయి.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు దేశంలోని వారే కాకుండా వివిధ దేశాల నుంచి ఎంతో మంది భక్తులు తరలివస్తుంటారు.ఈ తరుణంలో భక్తులు తలనీలాలతో పాటు కానుకలను కూడా సమర్పిస్తూ ఉంటారు.
తమ స్థాయికి మించి కోట్ల రూపాయల వరకు విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు.ఈ క్రమంలో కొంత మంది తిరుమలలో అన్నదానం చేయాలని భావిస్తూ ఉంటారు.
తిరుమలలో నిత్యం అన్నదానం కొనసాగుతూ ఉంటుంది.ఈ అన్నదానానికి విరాళం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు.
ఒక్కో రోజు అన్నదానం చేయాలంటే ఎన్ని లక్షలు చెల్లించాలో తెలిస్తే షాక్ అవుతారు.

తిరుమల కొండ భక్తులతో ప్రతి రోజు రద్దీగా ఉంటుంది.ఇక్కడికి వచ్చిన వారికి ఉచితంగా భోజనం పెడుతూ ఉంటారు.ఇందులో ప్రతి రోజు 60 నుంచి 70 వేల మంది భోజనం చేస్తూ ఉంటారు.
ఈ భవనంతో పాటు కాంప్లెక్స్ పీఏసి 2 లో కూడా అన్నదానం చేస్తూ ఉంటారు.అలాగే రాంభగీచా బస్టాండ్ కేంద్రీయ విచారణ కార్యాలయం పీఏసి 1 వద్ద కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది.
తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారికి తమకు తోచిన విధంగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు.డబ్బు, నగల రూపంలో కొందరు హుండీలో వేయగా మరికొందరు దేవాలయానికి నేరుగా విరాళాలు ఇస్తూ ఉంటారు.

అన్ని దానాలలో కెల్లా అన్నదానం( Annadanam ) ఎంతో గొప్పదని పెద్దవారు చెబుతూ ఉంటారు.ముఖ్యంగా శ్రీవారి దేవాలయంలో అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని ఎంతో మంది భక్తులు ( Devotees ) భావిస్తారు.ఇంకా చెప్పాలంటే కేవలం అన్నదానం మాత్రమే కాకుండా అల్పాహారం కూడా దానం చేయవచ్చని దేవాలయ ముఖ్యఅధికారులు చెబుతున్నారు.ఒక్కరోజు అల్పాహారానికి 8 లక్షలు గా కేటాయించారు.
అలాగే కేవలం మధ్యాహ్న భోజనానికి మాత్రమే 15 లక్షలు చెల్లించాలని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.ఈ అన్నదాన విరాళం ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక రోజును బుక్ చేసుకోవాలని కూడా చెబుతున్నారు.