కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.సంవత్సరం చివరి రోజులు కావడం వల్ల, సెలవులు కూడా కలిసి రావడంతో తిరుమలకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.
అంతేకాకుండా జనవరి ఒకటవ తేదీ ఆఫ్లైన్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం జరీ చేస్తుంది.తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు.
టోకెన్లు జారీ చేసే కేంద్రాలు వరుసగా భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూలు, ఇందిరా మైదానం, విష్ణు నివాసం, శ్రీనివాసం గోవిందరాజ సూత్రాలు, బైరాగి పట్టెడ జడ్పీ హైస్కూల్, శేషాద్రి నగర్, జడ్పీ హైస్కూల్ లలో ద్వారా టోకెన్లు జారీ చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
రోజుకు 50 వేల చొప్పున టోకెన్లను జారీ చేస్తున్నారు.
జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సంబంధించిన ఐదు లక్షల టోకెన్లు జారీ చేస్తామని భక్తులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే శ్రీవారిని దర్శించుకోవడానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.ఆదివారం రోజు శ్రీవారిని దాదాపు 70000 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇంకా చెప్పాలంటే 33,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.హుండీ ఆదాయం వల్ల స్వామివారికి దాదాపు 5 కోట్లు ఆదాయం వచ్చినట్లు టిటిడి ప్రకటించింది.డిసెంబర్ 27 శ్రీవారి దేవాలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేస్తున్నారు.ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఇవాళ సిఫారసు స్వీకరణ రద్దు చేస్తున్నట్లు కూడా తెలిపారు.ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 27 శ్రీవారి దేవాలయంలో విఐపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.