అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్

A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, కార్తీక్ జయంత్, ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్.

 Anil Ravipudi Unveils 'premedeshpu Yuvarani' Motion Poster Yamin Raj, Karthik Ja-TeluguStop.com

సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’.ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది.ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది.ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

’’ అని అన్నారు.

చిత్ర నిర్మాతలలో ఒకరైన వేమూరి ఆనంద్ మాట్లాడుతూ.

‘‘ముందుగా మా చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు.మోషన్ పోస్టర్ ఆయనకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

సినిమా కూడా మంచి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాము.మా దర్శకుడు సాయి సునీల్ ఈ కథ చెప్పిన తీరు నాకెంతో నచ్చింది.

అందుకే నా సన్నిహితుడు హరిప్రసాద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను.ఇందులో 5 పాటలు, 3 ఫైట్స్ ఉంటాయి.

మంచి లవ్ స్టోరీ.సినిమా చాలా బాగా వచ్చింది.

ఫస్ట్ కాపీ రెడీ అవుతోంది.త్వరలోనే విడుదల వివరాలను తెలియజేస్తాము.

’’ అని తెలిపారు.

దర్శకుడు సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ.

మా చిత్ర మోషన్ పోస్టర్ ఆవిష్కరించి.మా టీమ్‌ని బ్లెస్ చేసిన అనిల్ రావిపూడిగారికి థ్యాంక్స్.

సినిమా విషయానికి వస్తే.‘ప్రేమదేశపు యువరాణి’ టైటిల్ ప్రకటించగానే మంచి అప్లాజ్ వచ్చింది.

ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారు.నాకు సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు.

నిర్మాతలు అందించిన సహకారం మరువలేనిది.అతి త్వరలో టీజర్‌ని విడుదల చేయనున్నాము.

ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.అలాగే కాసర్ల శ్యామ్ గారి పాటలు, ఆర్పీ పట్నాయక్ సోదరుడు అజయ్ పట్నాయక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే చిత్రంగా ఈ సినిమా ఉంటుంది.’’ అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యామిన్ రాజ్, కార్తీక్ జయంత్ వంటి వారు మాట్లాడుతూ.వచ్చిన అవకాశానికి సంతోషం వ్యక్తం చేశారు.

నటీనటులు

యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రెవరి , సందీప్, రాజారెడ్డి, పవన్, యోగి కత్రి, శ్రవంతి, సునీత, ఇంటింటి గృహలక్ష్మి ఫేమ్ హరికృష్ణ, సాయి, బండ సాయి, భాష, సారిక, గణేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

బ్యానర్స్: A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్, సినిమాటోగ్రాఫర్: శివకుమార్ దేవరకొండ, మ్యూజిక్: అజయ్ పట్నాయక్ లిరిక్స్: కాసర్ల శ్యామ్, ఆర్ట్ డైరెక్టర్: నాయుడు రాజు, సౌండ్ ఎఫెక్ట్: పురుషోత్తం రాజు, ఫైట్ మాస్టర్: శివరాజ్ మాస్టర్ డాన్స్ మాస్టర్స్: కపిల్ మాస్టర్, శ్రీవీర్ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్: మహి, ఎడిటర్: యంఆర్.వర్మ పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్, పీఆర్వో: బి.వీరబాబు, నిర్మాతలు : ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్.సిహేచ్, రైటర్ అండ్ డైరెక్టర్ : సాయి సునీల్ నిమ్మల

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube