Janasena : జనసేనలో హామీ ఇచ్చిన వాళ్లకు సైతం టికెట్లు దక్కట్లేదుగా.. పవన్ లెక్క తప్పుతోందా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ( Pawan Kalyan’s party ) పెట్టి 10 సంవత్సరాలు అవుతోంది.పదేళ్లలో జనసేన పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదు.

 Pawan Kalyan Logic About Janasena Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఈ ఎన్నికల్లో జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తుండగా ఇప్పటికే 18 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన వెలువడింది.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి హామీ లభించిన నేతలలో చాలామందికి టికెట్లు దక్కకపోవడం గమనార్హం.

తణుకులో విడివాడ రామచంద్రారావుకు( Vidivada Ramachandra Rao ) గత ఎన్నికల్లో అన్యాయం చేశానని చెప్పిన పవన్ తణుకు టికెట్( Tanuku ticket ) అతనికి ఇస్తానని చెప్పి మాట తప్పారు.రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన కందుల దుర్గేశ్ ( Kandula Durges )కు నిడదవోలు టికెట్ ఇచ్చారు.

ఈ నియోజకవర్గంలో కందుల దుర్గేశ్ ప్రభావం చూపే అవకాశాలు అయితే తక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రెండేళ్ల క్రితం పితాని బాలకృష్ణకు ముమ్మిడివరం టికెట్ ఇస్తానని పవన్ హామీ ఇవ్వడం జరిగింది.

అయితే ఆ హామీని నిలబెట్టుకోవడంలో పవన్ ఫెయిలయ్యారు.పోతిన మహేశ్ కు విజయవాడ వెస్ట్ టికెట్ ఇస్తానని చెప్పిన పవన్ ఆ హామీ విషయంలో సైతం వెనక్కు తగ్గారు.విజయవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి సొంతమైంది.జగ్గంపేట టికెట్ దక్కకపోవడంతో ఇంఛార్జ్ సూర్యచంద్ర ( Incharge Suryachandra )ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.ఇలా జనసేనను నమ్ముకున్న నేతలందరూ ఏదో ఒక విధంగా నష్టపోయారు.

నాగబాబుకు అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చే విషయంలో సైతం పవన్ కళ్యాణ్ పొరపాటు చేశారనే సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేస్తే జనసేన పార్టీని కార్యకర్తలు, నేతలు ఏ విధంగా నమ్ముతారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.జనసేన అధినేత ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube